Bitter Gourd Pickle: ఆంధ్రాస్టైల్ లో టేస్టీ టేస్టీ కాకరకాయ నిల్వ పచ్చడి రెసిపీ మీ కోసం..

|

Dec 02, 2022 | 5:16 PM

కాకరకాయని, కూర, వేపుడు వంటి రకరకాల ఆహారపదార్ధాలను తయారు చేస్తారు..ఇవే కాకుండా కాకరకాయతో నిల్వ పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు. ఇది రుచి కరంగా ఉంటుంది.. దాదాపు రెండు నెలలు నిల్వ ఉంటుంది.

Bitter Gourd Pickle: ఆంధ్రాస్టైల్ లో టేస్టీ టేస్టీ కాకరకాయ నిల్వ పచ్చడి రెసిపీ మీ కోసం..
Kakarakaya Nilva Pachadi
Follow us on

మనం తీసుకునే అనేక కూరగాయల్లో ఒకటి కాకరకాయ. ఇది చేదుగా ఉంటుందని చాలామంది తినడానికి ఇష్టపడరు. అయితే  కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారకి ఇది దివ్య ఔషధం. అంతేకాదు కాకార కాయలో అనేక ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. కాకరకాయని, కూర, వేపుడు వంటి రకరకాల ఆహారపదార్ధాలను తయారు చేస్తారు..ఇవే కాకుండా కాకరకాయతో నిల్వ పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు. ఇది రుచి కరంగా ఉంటుంది.. దాదాపు రెండు నెలలు నిల్వ ఉంటుంది. ఈరోజు కాకరకాయ నిల్వ పచ్చడి తయారీ గురించి తెలుసుకుందాం..

 కాకరకాయ నిల్వ పచ్చడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు: 

కాక‌ర‌కాయ‌లు – 1/4 కేజీ
చింత‌పండు – అర కప్పుడు నానబెట్టాలి
కారం – ముప్పావు క‌ప్పు
వెల్లుల్లి రెమ్మలు  – 8
ఆవాలు – 3 టీ స్పూన్స్,
జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్,
ఎండుమిర్చి – ముక్కలు చేసినవి మూడు
క‌రివేపాకు – మూడు రెమ్మలు
మెంతులు – అర టీ స్పూన్,
ఉప్పు – రుచికి సరిపడా
పల్లి నూనె – పచ్చడికి సరిపడా

ఇవి కూడా చదవండి

త‌యారీ విధానం: ముందుగా కాకరకాయలు తీసుకుని గుండ్రని ముక్కలుగా కట్ చేసుకోండి. కొంచెం ఉప్పు వేసి.. పిండి పక్కన పెట్టుకోండి. తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టి.. అందులో ఆవాలు, మెంతులను వేసి దోరగా వేయించండి.. వీటిని తీసుకుని మిక్సీ జార్ లో వేసుకుని చల్లారనివ్వండి. ఇంతలో బాణలిలో నానబెట్టిన చింతపండు రసం వేసి.. అందులో కొంచెం ఉప్పు వేసి.. కొంచెం నూనె వేసి ఉడికించండి. ఇప్పుడు మరో కళాయి తీసుకుని నూనె వేసుకుని వేడి ఎక్కిన తరువాత కట్ చేసిన కాకరకాయ ముక్కలను వేసి దోరగా వేయించుకోండి. తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేయండి.. ఇప్పుడు ఆవాలు, మెంతులను మిక్సీ పట్టుకోండి.

ఇప్పుడు వేడి నూనెలో వేయించిన కాక‌ర‌కాయ ముక్క‌లు, చింతపండు గుజ్జు.. ఆవాలు, మెంతి పిండి వేసుకుని కలుపుకోవాలి. రుచి చూసుకుని కావాల్సినంత ఉప్పు వేసుకోండి. అంతే టేస్టీ కాకరకాయ ఊరగాయ రెడీ. దీనిని గాజు సీసాలో నిల్వ చేసుకుంటే దాదాపు రెండు నెలలు ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..