చేదు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుందంట..! ఇలాంటి వారు కాకరకాయకు దూరంగా ఉండటమే బెటర్..

|

Oct 26, 2024 | 1:02 PM

కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ, అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు, గర్భిణీ స్త్రీలు, కిడ్నీ రాళ్లతో బాధపడేవారికి మరింత హానికరంగా మారుతుంది.. చేదును తగ్గించడానికి, బాగా కడగడం, గింజలు తీసివేయడం, ఉల్లిపాయలు ఎక్కువగా వాడటం వంటి చిట్కాలు ఉపయోగించాలి.. ఎక్కువ చేదు ఎలాంటి హాని కలిగిస్తోందో తెలుసుకోండి..

చేదు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుందంట..! ఇలాంటి వారు కాకరకాయకు దూరంగా ఉండటమే బెటర్..
Bitter Gourd Benefits and Side Effects
Image Credit source: Getty Images
Follow us on

ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందిన కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది.. రుచిలో చేదుగా ఉన్నప్పటికీ.. శరీరంలోని ఎన్నో సమస్యలకు దివ్యౌషధం లాంటిదని నిపుణులు చెబుతుంటారు.. కాకరకాయ తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు దూరం అవుతాయి. అయితే.. చేదుగా ఉందన్న కారణంతో కాకరకాయను చాలా మంది తినరు.. అయితే.. కొందరు రుచిని పట్టించుకోకుండా చాలా పోషకాలున్న కాకరకాయను తీసుకుంటారు. అయితే.. కాకారను ఎక్కువగా తీసుకుంటే ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కాకరకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి..

కాకరకాయను ఎలాంటివారు తినకూడదు.. తింటే కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకోండి..

టైప్-1 డయాబెటిస్ పేషంట్స్: టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడేవారు చేదు కూరగాయ లేదా కాకరకాయ రసాన్ని తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా తగ్గిస్తుంది.. దీనివల్ల బలహీనత – మైకము కలిగించవచ్చు. కావున మధుమేహంలో కాకరకాయను ఎక్కువ మోతాదులో అస్సలు తీసుకోకండి..

గర్భిణీ స్త్రీలు: వేడి ప్రభావం కలిగిన కాకరకాయను గర్భిణులు తీసుకోవడం మానుకోవాలి.. ఎందుకంటే ఇది గర్భాశయాన్ని ప్రభావితం చేస్తుంది.. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఇవి కూడా చదవండి

కిడ్నీ స్టోన్ పేషెంట్లు: కాకరకాయలో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది.. కాబట్టి దీనిని తినేవారికి కిడ్నీలో రాళ్ల సమస్య ఉండవచ్చు.. లేదా అప్పటికే కిడ్నీల్ోల రాళ్లు ఉంటే సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కాకరకాయ ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో విషపూరితం పెరుగుతుంది.

కాకరకాయ చేదును ఎలా తగ్గించాలి..?

అయితే.. కాకరకాయ ఎక్కువగా చేదు ఉంటుంది కావున.. ఇది కొన్ని సమస్యలు ఉన్న వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కాకర చేదును తగ్గించాలనుకుంటే.. కొన్ని చిట్కాలను పాటించడం మంచిది.. కాకరకాయలో చేదు తగ్గిపోయి, పెద్దగా హాని చేయకుండా ఉండాలంటే దానిని సరిగ్గా ఉడికించాలి. అన్నింటిలో మొదటిది, కాకరకాయను బాగా కడగాలి.. దాని గింజలను తీసివేయండి, ఎందుకంటే విత్తనాలు చాలా చేదుగా ఉంటాయి. మీకు కావాలంటే, చేదును తగ్గించాలనుకుంటే.. కాకర కూర తయారీలో ఎక్కువ ఉల్లిపాయను ఉపయోగించవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి