Bakrid Biryani Recipe: బక్రీద్ పండుగకు పర్ఫెక్ట్ రెసిపీ తే బిర్యానీ..! రుచి మామూలుగా ఉండదు.. అదిరిపోద్ది..!
బక్రీద్ పర్వదినాన్ని మరింత రుచిగా మార్చే తే బిర్యానీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పండుగ సమయంలో కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఆస్వాదించదగిన ఈ రెసిపీని తినేవారికి మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది. సులభమైన విధానంతో ఇది ఇంట్లోనే తయారు చేయవచ్చు.

బక్రీద్ 2025.. ఈ ఈద్ కి ప్రత్యేక రెసిపీలు ప్రయత్నించండి.. మంచి రెసిపీ పండుగ సంబరాలను మరింత ఆనందంగా మారుస్తుంది. ఇండియాలో ఈద్ అల్ అద్హా లేదా బక్రీద్ ను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ వెనుక ప్రధాన ఉద్దేశ్యం అల్లాహ్ ఆజ్ఞను పాటిస్తూ.. ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడైన ఇస్మాయిల్ ని బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న సంగతిని గుర్తించడమే. ఈ నిబద్ధతను గౌరవించి.. ఆ దేవుడు ఇస్మాయిల్ స్థానంలో ఒక గొర్రెను బలిగా పెట్టారు. బక్రీద్ పండుగ ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇవాళ మనం బక్రీద్ స్పెషల్ తే బిర్యానీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
తే బిర్యానీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
- బాస్మతి బియ్యం – 1 కిలో
- యాలకులు – 6 గ్రాములు
- లవంగాలు – 8 గ్రాములు
- దాల్చిన చెక్క – 10 గ్రాములు
- పాలు – 250 మిల్లీలీటర్లు
- గులాబ్ జల్ – కొన్ని చుక్కలు
- కేవ్రా – కొన్ని చుక్కలు
- నూనె – 200 మిల్లీలీటర్లు
- ఎర్ర మిరప పొడి – 10 గ్రాములు
- ఉప్పు – రుచికి తగినంత
- మటన్ – 2 కిలోలు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – 100 గ్రాములు
- వేయించిన ఉల్లిపాయలు – 200 గ్రాములు
- జావిత్రి యాలకుల పొడి – 10 గ్రాములు
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టండి. ఆ తర్వాత ఒక పాత్రలో నీళ్లు మరిగించి అందులో ఉప్పు, యాలకులు, లవంగాలు వేసి ఉడికించండి. నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యాన్ని వేసి సగం వరకు ఉడికించి.. వెంటనే నీళ్లు వడకట్టి పక్కన పెట్టుకోండి.
మటన్ మాంసాన్ని విడిగా మరో పాత్రలో వేడి చేసి ఉడికించిన మాంసం ముక్కలను పక్కన పెట్టండి. మాంసం ఉడికించిన నీటిలో పాలు, ఉప్పు, ఎర్ర మిరప పొడి, జావిత్రి యాలకుల పొడి, కేవ్రా, గులాబ్ జల్ వేసి బాగా మరిగించండి. ఇప్పుడు మళ్లీ బియ్యాన్ని వేసి మెల్లగా కప్పండి. బిర్యానీ పాత్ర లోపల చిన్న చిన్న రంధ్రాలు చేసి మూత పెట్టండి. ఆ పాత్రను ఒక అట్ల పెనం మీద పెట్టి మంట తగ్గించి.. మూత వేసి వేడి చేయండి. బిర్యానీ పైన అల్యూమినియం ఫాయిల్ తో పూర్తిగా కప్పి, గాలి పోకుండా సీల్ చేయండి. పాత్రను నేరుగా మంటపై పెట్టి మంట పాత్ర అంచుకు వచ్చేలా నిరంతరం తిప్పుతూ.. ఫాయిల్ ఉబ్బేవరకు ఉడికించండి. తర్వాత తీసి వేసి కాసేపు పక్కకు ఉంచండి. ఇప్పుడు వడ్డించండి.. టేస్టీ తే బిర్యానీ రెసిపీ రెడీ అయ్యింది.
మటన్ ను ముందుగా ఉడకబెట్టే విధానం
మటన్ ను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా చూసుకోండి. తర్వాత ఒక పాత్రలో నూనె వేసి, మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఉప్పు, ఎర్ర మిరప పొడి, వేయించిన ఉల్లిపాయలు వేసి మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత కాస్త వేపడం ద్వారా నూనె బయటకు రావడాన్ని మీరు గమనించొచ్చు.




