Atta or Maida: మనం వంటల తయారీకి సర్వసాధారణంగా గోధుమ పిండి, మైదా పిండిలను ఉపయోగిస్తాం.. ఐతే ఈ రెండు రకాల పిండిల్లో ఏది ఆరోగ్యకరమైందో తెలుసుకోవడం అలా ఉంచితే నేటి భారతీయ యువతకు అసలు గోధుమ పిండి, మైదా పిండిల మధ్య తేడా ఏమిటో కూడా తెలియదు.. వాటి మధ్య తేడా ఎలా గుర్తించాలో కూడా తెలియదు.
అయితే గోధుమ పిండి, మైదా రెండూ గోధుమ ధాన్యం నుండి తయారవుతాయి. అయితే గోధుమ పిండిని ఆరోగ్యకరమైన గుణాలు నిలిచేలా తక్కువుగా ప్రాసెస్ చేస్తూ గోధుమ ధాన్యాన్ని మర పట్టించి తయారు చేస్తారు. అయితే మైదా మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమ పిండి. పసుపు రంగులో ఉండే గోధుమ పిండిని కొన్ని రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు. ఇంకా గోధుమ పిండి ను ముట్టుకుంటే ముతకగా ఉంటుంది. అదే మైదా పిండి మృదువుగా ఉంటుంది.
ఇక భారతీయ ఆహార సంస్కృతిలో గోధుమ పిండికి ప్రముఖ స్థానం ఉంది. అయితే మైదాతో తయారుచేసిన ఆహారాలు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తారు. ముఖ్యంగా పండగలు, ఫంక్షన్లకు చేసే ఆహారపదార్ధాల్లో మైదాను ఉపయోగిస్తారు.
ఇక పోషణ విషయానికి వస్తే 2013 లో యాంటీఆక్సిడెంట్లలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం తృణధాన్యాలు అత్యుత్తమ ఆహారమని తెలుస్తోంది. ఫైబర్, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు తృణధాన్యాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారి మరపట్టించే గోధుమ పిండి తృణధాన్యాల తర్వాత ఉత్తమమైన ఆహారమని తెలుస్తోంది. గోధుమ పిండిలో ఫైబర్, ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మరియు పిండి పదార్థాలు ఉన్నాయి.
అయితే మైదా పిండి అనేది మైదా మిల్లులో బాగా పోలిష్ చేయడంతో అన్ని పోషక పదార్ధాలు తొలి స్వచ్ఛమైన పిండిగా మిగులుతుంది. దీంతో మైదాలో కార్బోహైడ్రేట్లు మరియు చాలా తక్కువ మొత్తంలో ఇతర పోషకాలు ఉంటాయి. ఇది మన శరీరానికి నిజంగా హానికరం” అని పోషకాహార నిపుణులు అకాంక్ష మిశ్రా చెప్పారు. బరువు తగ్గాలనుకున్న వారు , షుగర్ వ్యాధి గ్రస్తులు , జీర్ణ సంబంధిత వ్యాధులున్నవారు మైదా వాడకం తగ్గించమని సూచిస్తామని చెప్పారు.
“మరోవైపు, మొత్తం గోధుమ పిండి లేదా అట్టాలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి 1, బి 3, బి 5, రిబోఫ్లేవిన్ మరియు ఫోలేట్ లు ఉన్నాయని.. అంతేకాదు.. కాల్షియం మరియు ఐరన్ కూడా ఉన్నాయి. కనుక ఎవరైనా గోధుమ తినాలనుకునే వారు రెగ్యులర్ డైట్‌లో అధిక ఫైబర్ ఉండే గోధుమ పిండి ని చేర్చుకోవాలని తెలిపారు. ఖచ్చితంగా, మైదాతో తయారుచేసిన బేకరీ లేదా ఇంట్లో వండిన వంటకాలు రుచికరమైనవే.. ఐతే పోషణ విషయానికి వస్తే.. గోధుమ పిండే మంచిది. కనుక రెండూ ఓకె ఆహార ధాన్యం నుంచి వచ్చినప్పటికీ .. గోధుమ పిండినే వాడడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: కింగ్ కోబ్రాను ఒక్క నిమిషంలో ఖతం చేసింది.. ఈ ముంగిస స్కిల్స్ అదుర్స్…
తమిళనాట అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై ఈసీ కన్ను.. బిర్యానీ నిల్.. సాంబార్ అన్నం ఫుల్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ గిఫ్ట్‌గా రూ. 10 వేలు.. వివరాలివే.!