Chicken: చికెన్ కడిగేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా.. అయితే ఏమవుతుందో తెలుసా..?

పచ్చి చికెన్‌ను కేవలం నీటితో కడగడం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశించదు, పైగా వంటగది అంతా వ్యాపిస్తుంది. క్యాంపిలోబాక్టర్, సాల్మోనెల్లా వంటి సూక్ష్మజీవులను సమర్థవంతంగా తొలగించడానికి నిమ్మరసం లేదా ఉప్పు, పసుపు కలిపిన గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇది దుర్వాసనను పోగొట్టి, చికెన్‌ను మృదువుగా చేసి, వంటకాలకు అద్భుతమైన రుచిని అందిస్తుంది.

Chicken: చికెన్ కడిగేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా.. అయితే ఏమవుతుందో తెలుసా..?
How To Clean Chicken Properly

Updated on: Dec 30, 2025 | 9:27 PM

మాంసాహార ప్రియులకు చికెన్ అంటే ప్రాణం. ఆదివారం వచ్చిందంటే చాలు.. చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే మార్కెట్ నుండి తెచ్చిన చికెన్‌ను మీరు ఎలా శుభ్రం చేస్తున్నారు..? చాలామంది సాధారణ నీటితో రెండు మూడు సార్లు కడిగి వెంటనే వంట చేసేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మాంసంలోని హానికరమైన బాక్టీరియా పోవడమేమో గానీ మీ వంటగది అంతా వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి చికెన్‌ను శుభ్రం చేసే సరైన మార్గం ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎందుకు సాధారణ నీరు సరిపోదు?

పచ్చి చికెన్‌లో క్యాంపిలోబాక్టర్ లేదా సాల్మోనెల్లా వంటి ప్రమాదకరమైన సూక్ష్మజీవులు ఉంటాయి. వీటిని కేవలం నీటితో కడగడం వల్ల అవి చావవు. పైగా ఆ నీటి తుంపర్లు పడటం వల్ల మీ సింక్, పక్కనే ఉన్న పాత్రలకు కూడా బాక్టీరియా వ్యాపిస్తుంది.

నిమ్మరసంతో శుభ్రం చేయండి

చికెన్‌ను శుభ్రం చేయడానికి నిమ్మరసం అత్యుత్తమ మార్గం. ఒక లీటరు గోరువెచ్చని నీటిని తీసుకుని, అందులో రెండు మూడు టీస్పూన్ల నిమ్మరసం కలపండి. కడిగిన చికెన్‌ను ఈ నీటిలో వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టండి. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ బాక్టీరియాను సంహరిస్తుంది. అంతేకాకుండా పచ్చి మాంసం నుంచి వచ్చే నీచు వాసనను పూర్తిగా తొలగించి, మాంసం తాజాగా ఉండేలా చేస్తుంది. ప్రొఫెషనల్ చెఫ్‌లు కూడా రుచి పెరగడానికి ఈ పద్ధతినే పాటిస్తారు.

ఇవి కూడా చదవండి

ఉప్పు, పసుపు నీటితో అదనపు రక్షణ

మరొక సురక్షితమైన పద్ధతి ఉప్పు నీటి వినియోగం. ఒక లీటరు గోరువెచ్చని నీటిలో రెండు టీస్పూన్ల ఉప్పు, చిటికెడు పసుపు వేయండి. ఈ మిశ్రమంలో చికెన్‌ను కాసేపు ఉంచి తర్వాత మంచి నీటితో కడగండి. ఉప్పు, పసుపు సహజమైన యాంటీ సెప్టిక్‌గా పనిచేసి సూక్ష్మజీవులను అరికడతాయి.

రుచి కూడా పెరుగుతుంది

నిమ్మరసం లేదా వెనిగర్‌తో చికెన్‌ను కడగడం వల్ల మాంసం మెత్తగా మారుతుంది. దీనివల్ల మీరు వండే కూర లేదా ఫ్రై ముక్కలకు మసాలాలు బాగా పట్టి, రుచి అద్భుతంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..