Kandi Pachadi Recipe: ఈజీగా టేస్టీగా ఆంధ్రా స్టైల్‌లో అమ్మమ్మ కాలం నాటి కందిపప్పు పచ్చడి తయారీ..

Kandi Pachadi Recipe: ప్రస్తుత జనరేషన్ లో పిజ్జాలు బర్గర్లు మంచూరియా వంటి ఫస్ట్ ఫుడ్ వచ్చాయి కానీ... ఒకటి రెండు జనరేషన్లకు ముందు అమ్మమ్మ చేసిన వంటలు అంటే అప్పటి మనవలు, మనవరాళ్లకు ఎంతో..

Kandi Pachadi Recipe: ఈజీగా టేస్టీగా ఆంధ్రా స్టైల్‌లో అమ్మమ్మ కాలం నాటి కందిపప్పు పచ్చడి తయారీ..
Kandipappu Pacchadi

Updated on: Sep 18, 2021 | 4:16 PM

Kandi Pachadi Recipe: ప్రస్తుత జనరేషన్ లో పిజ్జాలు బర్గర్లు మంచూరియా వంటి ఫస్ట్ ఫుడ్ వచ్చాయి కానీ… ఒకటి రెండు జనరేషన్లకు ముందు అమ్మమ్మ చేసిన వంటలు అంటే అప్పటి మనవలు, మనవరాళ్లకు ఎంతో ఇష్టం.. అమ్మమ్మ పొయ్యిమీద చేసిన దిబ్బరొట్టి.. దానికి కాంబినేషన్ గా రోట్లో దంచిన కంది పప్పు పచ్చడి, దీనికి తోడు చెరకు పానకం వేసుకుని తినేవారు.. ఇక కంది పచ్చడి టిఫిన్స్ లోకే కాదు.. అన్నంలోకి కూడా మంచి రుచికరమైన రోటి పచ్చడి. ఈరోజు ఈజీగా టేస్టీగా ఆంధ్రా స్టైల్ లో అమ్మమ్మ కాలం నాటి కంది పచ్చడి తయారీ గురించి తెలుసుకుందాం..

కందిపచ్చడికి కావలసిన పదార్ధాలు:

కందిపప్పు – 150 గ్రాములు .
ఎండుమిరపకాయలు – 12
జీలకర్ర – ముప్పావు స్పూను .
చింతపండు – చిన్న ఉసిరికాయంత (విడదీసి నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి)
ఉప్పు – రుచికి సరిపడా

పచ్చడి పోపుకి కావాలిన దినుసులు:

ఎండుమిర్చి ముక్కలు
మినపప్పు – ఒక టేబుల్ స్పూన్
ఆవాలు – అర స్పూను
కరివేపాకు – మూడు రెమ్మలు
నెయ్యి – తగినంత
ఇంగువ- కొంచెం
వెల్లుల్లి -నాలుగు రెమ్మలు

తయారీ విధానం:

ముందుగా స్టౌ మీద బాణలి పెట్టి బాండీ బాగా వేడెక్కిన తర్వాత అందులో ముందుగా కందిపప్పు వేసుకుని మాడకుండా బంగారు రంగు వచ్చేవరకూ వేయించుకుని బాణలి నుంచి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు , జీలకర్ర వేసి పప్పు మాడకుండా బంగారు రంగులో వేయించు కోవాలి. ఇవి చల్లార్చుకుని.. రోట్లో వేయించుకున్న కందిపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకుని దానిలో నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకుని కొంచెం ఉప్పువేసి రుబ్బుకోవాలి. ఇలా తయారైన పచ్చడిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి.

మళ్ళీ స్టౌ మీద బాణలి పెట్టి పోపుకి సరిపడే నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే ఎండుమిర్చి ముక్కలు , మినపప్పు , ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి, కొంచెం ఇంగువ వేసుకుని వేయించుకోవాలి. పోపు వేగగానే దీనీలో రుబ్బుకున్న కంది పచ్చడిలో వేసి కొంచెం నీళ్ళు పోసి కొద్ది సేపు ఉడికించి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఈ కంది పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినవచ్చు. లేదంటే మజ్జిగ పులుసు కూడా మంచి కాంబినేషన్.

Also Read: