ఆవకాయ చికెన్ బిర్యానీ సాధారణ బిర్యానీ కంటే భిన్నంగా రుచిలో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ బిర్యానీ తక్కువ మసాలా దినులతో చేసినా పుల్ల పుల్లగా కారంగా డిఫరెంట్ టేస్ట్ తో ఉంటుంది. దీనిని ఆంధ్ర స్పెషల్ ఆవకాయ తో తయారు చేస్తారు. ఈ ఆవకాయ చికెన్ బిర్యానీ మంచి ఆదరణ సొంతం చేసుకుని తెలుగు వారి రెస్టారెంట్ లో మొదటి ప్లేస్ ని సొంతం చేసుకుంది. అసలు ఈ ఆవకాయ చికెన్ బిర్యాని తయారీకి ఆవపిండితో చేసే ఆవకాయని ఉపయోగిస్తారు. దీనిని మొదటి సారిగా విజయవాడలో చేశారట. ఈ రోజు ఈ ఆంధ్రా స్టైల్ లో ఆవకాయ చికెన్ బిర్యానీ రేసిపీని తెలుసుకుందాం.
తయారుచేసే విధానం: ముందుగా చికెన్ ను శుభ్రం చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చికెన్ లో పసుపు, కొంచెం ఉప్పు, కారం వేసి బాగా కలిపి ఒక పక్కకు పెట్టుకోవాలి. తర్వాత బియ్యాన్ని నీటిలో నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్రెషర్ కుక్కరు తీసుకుని వేడి చేసి మూడు స్పూన్ల నెయ్యి, కొంచెం నూనె వేసి వేడి చేసుకోవాలి. ముందుగా తీసుకున్న బిర్యానీ ఆకులు ,దాల్చిన చెక్క,లవంగాలు,యాలకులు జాపత్రి, అనాస పువ్వు, రాతి పువ్వు వరసగా వేసి మంచి స్మెల్ వచ్చేటంత వరకూ వేయించండి. ఈ మసాలా దినుసుల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చీల్చిన పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఈ మిశ్రమంలో పసుపు, రుచికి సరిపడా కారం వేసి వేయించి ఇప్పుడు మార్నేట్ చేసిన చికెన్ ముక్కలు వేసి వేయించుకుని ఉడికిన తర్వాత ఆవకాయ పచ్చడి వేసి, కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా వేసి కొత్తిమీర, పుదీనా వేసి వేయించి.. ఇప్పుడు రెండున్నర కప్పుల నీరు పోసి తర్వాత నానపెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి. స్విమ్ లో ఆవకాయ చికెన్ బిర్యానీని ఉడికించాలి. అంతే టేస్టీ టేస్టీ ఆవకాయ చికెన్ బిర్యానీ రెడీ. దీనిని రైతాతో తింటే ఆహా అనాల్సిందే ఎవరైనా..
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..