Onion Pakoda: వర్షాకాలం వచ్చిందంటే చాలు మనసు వేడి వేడి బజ్జీలవైపో.. లేదంటే ఉల్లిపాయ పకోడీలవైపో చూస్తుంది. ఓ వైపు చల్ల చల్లని వాతావరణం .. వేడి ఉల్లిపకోడీని తింటే అప్పుడు కలిగే మజానే వేరు. ఈరోజు టేస్టీ టేస్టీ ఉల్లిపాయ పకోడీ తయారీ విధానం తెలుసుకుందాం
ఉల్లిపాయ – సన్నగా పొడవుగా తరిగినవి రెండు కప్పులు
శనగపిండి ఒక కప్పు
పచ్చిమిర్చి చిన్నగా తరిగిన ముక్కలు
కొత్తిమీర చిన్నగా తరిగిన కొత్తిమీర
కర్వేపాకు
ఉప్పు రుచికి సరిపడా
బేకింగ్ సోడా చిటికెడు
నీళ్లు తగినన్ని
కారం కొంచెం
నూనె వేయించడానికి సరిపడా
ముందుగా పొడవుగా తగిన ఉల్లిపాయ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని గిన్నెలోకి తీసుకుని కొంచెం ఉప్పు వేసి.. వాటిని నలపాలి.. అప్పుడు కొంచెం నీరు కింద వస్తుంది. అనంతరం శనగ పిండి, కొత్తిమీర తురుము, కరివేపాకులు చిన్నగా కత్తిరించి వేసుకోవాలి. ఈ మిశ్రమంలోకి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా , కొంచెం కారం వేసి కొద్దికొద్దిగా నీళ్లు వేస్తూ కొద్దిగా గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. అపుడే పకోడీలు క్రిస్పీగా ఉంటాయి.
ఈ విధంగా పకోడీకి మిశ్రమాన్ని రెడీ చేసుకుని అనంతరం స్టవ్ ఫై బాణలి పెట్టుకుని .. అందులో వేయించడానికి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడి అయిన శనగపిండి మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని చిన్న చిన్నగా నూనెలు వేసుకుంటూ బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న పకోడీలను వేడివేడిగా తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి.
Also Read: టీచింగ్ మీద ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం.. భారీ వేతనంతో ఎన్‌ఆర్‌టీఐ నోటిఫికేషన్