Health benefits of coconut water: సమ్మర్ వచ్చేసింది.. హీట్ పెరిగిపోతుంది.. దీంతో ఎక్కువమంది డేంజర్ అని తెలిసినా కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతారు. అదే పనిగా శీతల పానియాలు సేవిస్తూ ఉంటారు. ఇవి ఎంత డేంజరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు కొబ్బరి బోండాలు అందుబాటులో ఉన్నప్పుడు ఈ కూల్ డ్రింక్స్ ఎందుకు తాగుతారో అర్థం కాని విషయం. మీకు తెలియదేమో… అందుకే కొబ్బరి నీళ్ల ప్రాముఖ్యతను మరోసారి వివరించబోతున్నాం. కొబ్బరి నీళ్ల టేస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి రసాయనాలు లేకుండా ఉండటంతో ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇటు ఆరోగ్యం అందించడంతోపాటు ఎలాంటి దుష్ప్రభాలు కలిగించని ఏకైక పానీయం కొబ్బరి నీళ్లు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు, ఎంజైమ్‌లు, బి-కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ సి వంటి అనేక పోషకాలు ఉంటాయి. కొబ్బరి నీటిలో 94% నీరు.. చాలా తక్కువ మొత్తంలో కొవ్వు ఉంటుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి బాగా ఉంటుంది. అలాగే, ఇందులో ఉండే సైటోకినిన్స్ వృద్ధాప్య సంకేతాలు రాకుండా నిరోధిస్తాయి. మీ డైట్‌లో కొబ్బరి నీళ్లను భాగం చేసుకుంటే శారీరకంగా ఎంతో దృఢంగా, నాజూకుగా తయారు కావచ్చని నిపుణులు అంటున్నారు.
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
‘మత్స్యకన్య’ ! కోతి-చేప కలయికే కారణమా..? మతి పోగొట్టే విషయాలు !