చామంతి టీ తో అద్భుత ప్రయోజనాలు..! ఈ 6 ఆరోగ్య సమస్యలకు దివ్యఔషధం.. ఏంటో తెలుసుకోండి..

Chamomile Tea: చామంతి పూలని దశాబ్దాల క్రితం నుంచి ఆయుర్వేద వైద్యులు మూలికా వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఎన్నో ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

చామంతి టీ తో అద్భుత ప్రయోజనాలు..! ఈ 6 ఆరోగ్య సమస్యలకు దివ్యఔషధం.. ఏంటో తెలుసుకోండి..
Chamomile Tea

Updated on: Sep 01, 2021 | 8:53 PM

Chamomile Tea Bendits: చామంతి పూలని దశాబ్దాల క్రితం నుంచి ఆయుర్వేద వైద్యులు మూలికా వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఎన్నో ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. నిద్రలేమి సమస్యలకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఒత్తిడి తగ్గించడానికి ఒక కప్పు చామంతి టీ అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ టీ మంచి సువాసనతో, పూల రుచిని కలిగి ఉంటుంది. చామంతి టీ ఈ 6 ఆరోగ్య సమస్యలకు చక్కగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. చామంతి టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి వాపు లక్షణాలు తగ్గిస్తాయి. కీళ్లనొప్పులు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ప్రతిరోజు కప్పు చామంతి టీ తాగితే చాలా మంచిది.

2. కప్పు చామంతి టీ జలుబుకు గొప్పగా పనిచేస్తుంది. చల్లటి వాతావరణం ఉన్నప్పుడు, జలుబు లక్షణాలను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని పలు అధ్యయనాలు తేల్చాయి.

3. చామంతి టీ గుండెకు మేలు చేస్తుంది. కొరోనరీ హార్ట్ డిసీజ్ వంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి చామంతి టీ తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం.

4. భోజనం చేసే ముందు చామంతి టీ తాగడం వల్ల జీర్ణప్రక్రియ మెరుగుపడి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. చామంతి టీ రోజూ తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

5. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు చామంతి టీ తాగడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. బరువు తగ్గాలనుకొనేవారికి సైతం చామంతి టీ మంచి ప్రత్యామ్నాయం.

6. ఒక కప్పు చామంతి టీ ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మీకు శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి దోహం చేస్తుంది.

7. అందం,. ఆరోగ్యం విషయంలో ఎన్నో ప్రయోజనాలున్న ఈ వలన కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అలర్జీ ఉన్నతికి ఈ మంచిది కాదు.. అంతేకాదు ఈ టీని రోజుకి ఒకటి కంటే ఎక్కువ సార్లు తాగితే వాంతులు అయ్యే అవకాశం ఉంది. గర్భం దాల్చిన మహిళలు, పాలిచ్చే తల్లులు, రక్తం గడ్డకుండా మాత్రలు ఉపయోగించేవారు చామంతి టీ తాగాలనుకొంటే ముందు వైద్యుని సలహా తీసుకోవడం తప్పనిసరి.

BH Series Registration: వాహనాల తాజా రిజిస్ట్రేషన్ విధానం బీహెచ్ సిరీస్ ఏమిటి? దాని గురించి పూర్తిగా తెల్సుకుందాం..

Dengue Fever: జనాలపై దండెత్తిన డెంగీ.. బాధితుల భయాన్ని క్యాష్ చేసుకుంటున్న ఆస్పత్రులు, ల్యాబరేటరీలు

Cow as National Animal: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి.. కేంద్రానికి అలహాబాద్ హైకోర్టు కీలక సూచన..