Turmeric Water : మనం ఆరోగ్యంగా ఉండటానికి అనేక రకాల పానీయాలు తీసుకుంటాం. కానీ ప్రతిరోజు పసుపు నీళ్లు తాగడం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా.. పసుపును కషాయాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ఆయుర్వేద దివ్య ఔషధం. ఇది వ్యాధులను నియంత్రించడానికి వాడుతారు. పసుపు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ రోజు మనం పసుపు నీటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
దీని కోసం మీరు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు కలపాలి. ఈ పానీయం చేయడానికి తాజా పసుపు పొడిని ఉపయోగించాలి. ప్రారంభంలో పసుపు నీటి రుచి మంచిది ఉండదు కానీ కొన్ని రోజుల్లో మీరు దానికి అలవాటుపడతారు. పసుపులో కర్కుమిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కణాలను రిపేర్ చేయడంలో ఉపయోగపడుతుంది.
1. కడుపులో మంట, చికాకును తగ్గిస్తుంది
పసుపులో మంటను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కీళ్ల నొప్పులను తగ్గించుకోవడానికి కూడా మీరు పసుపును ఉపయోగించవచ్చు.
2. కాలేయ సంక్రమణ
ఒక వ్యక్తికి కాలేయ సమస్య ఉంటే పసుపు నీటిని తాగాలి. ఇది ఔషధం కంటే తక్కువేమి కాదు. పసుపు విష పదార్థాలను బయటకు పంపడానికి చక్కగా పనిచేస్తుంది.
3. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది
రోజూ పసుపు నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అపానవాయువు, గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది.
4. చర్మానికి ప్రయోజనకరం
చర్మ సమస్యలను తొలగించడానికి పసుపు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు నిమ్మ, తేనెతో పసుపు కలిపి ముఖానికి రాసుకోవచ్చు. ఇది శరీరంలోని టాక్సిన్‌లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. మీరు చర్మంపై ముడతలు వదిలించుకోవడానికి కూడా దీనిని వాడుతారు.