
భారతదేశంలోని ప్రజలు ఆహారం విషయంలో చాలా భిన్నమైన ఎంపికలను కలిగి ఉంటారు. కొందరు పూర్తిగా శాఖాహారులు, మరికొందరు మాంసాహారులు. కొంతమంది మాంసం తినరు కానీ గుడ్లు తింటారు. అయితే ఇప్పుడు ఆహరం మీద శ్రద్ధ పెరిగి చాలా మంది పూర్తిగా శాకాహారిగా మారారు. అంటే జంతువుల నుంచి వచ్చే పాలు, నెయ్యి కూడా వద్దు అని అంటున్నారు. పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకుంటున్నారు.
అందువల్ల, మనం ఏమి తింటామో దాని గురించి పూర్తి సమాచారం కలిగి ఉండటం చాలా అవసరం. అటువంటి పరిస్థితిలో ఎవరైనా సరే తినే ఆహారం ప్యాకెట్ ని జాగ్రత్తగా చూస్తే.. ప్రతి ఆహార వస్తువు ప్యాకెట్‌పై ఒక చిన్న రంగు గుర్తు ఉంటుంది. కొన్నిసార్లు ఆకుపచ్చ, కొన్నిసార్లు ఎరుపు, కొన్నిసార్లు పసుపు, నీలం లేదా నలుపు రంగులో గుర్తులుంటాయి.
ఇవి డిజైన్‌లో ఒక భాగం కాదు.. తినడానికి ముందే ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. ఈ రంగులు దేనిని సూచిస్తాయి.. ఈ ప్యాకెట్ ఫుడ్ ని ఎంచుకునే ముందు.. నల్లటి రంగులో గుర్తు ఉంటే తినే విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలో ఈ రోజు తెలుసుకుందాం..
ఆకుపచ్చ గుర్తు: ఇది ఉత్పత్తి పూర్తిగా శాఖాహారమని సూచిస్తుంది. అంటే ఇందులో మాంసం, గుడ్డు లేదా మరే ఇతర జంతు ఉత్పత్తి ఉండదని అర్ధం.
ఎరుపు గుర్తు: ఇది ఉత్పత్తి మాంసాహారమని సూచిస్తుంది. మీరు శాఖాహారులైతే ఈ ప్యాకేజ్ ఫుడ్ నాన్ వెజ్ అంటూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
నీలి రంగు గుర్తు: ఫుడ్ ప్యాకెట్ మీద ఈ నీలి రంగు లో గుర్తు ఉంటే దాని అర్థం ఈ ఉత్పత్తి వైద్యానికి సంబంధించినది. దీని అర్థం దీనిని వైద్య సహాయానికి ఉపయోగించవచ్చు వైద్యుడి సలహా లేకుండా దీనిని ఉపయోగించవద్దు.
పసుపు గుర్తు:పసుపు రంగులో ఉంటే.. ఈ ఆహార పదార్ధంలో గుడ్లు ఉన్నాయని సూచిస్తుంది. చాలా మంది గుడ్లు తినరు. అలాంటి వారికి ఈ సమాచారం చాలా ముఖ్యం.
నల్లటి రంగులో గుర్తు ఉంటే: ఆహార ప్యాకెట్‌పై నల్లటి మచ్చ ఉంటే.. ఈ ఉత్పత్తిలో పెద్ద మొత్తంలో రసాయనాలు ఉన్నాయని సూచిస్తుంది. వీటిని రుచిని పెంచడానికి, కలర్ ఫుల్ గా కనిపించేందుకు లేదా ప్యాకెట్ లో ఆహారం ఎక్కువ కాలం చెడిపోకుండా రసాయనాలు కలిపారు అని అర్ధం. కనుక వీటిని తినడం ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
నల్లటి రంగులో ఉన్న ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ, కాలేయం, మూత్రపిండాలు ప్రభావితమవుతాయని నిపుణులు భావిస్తున్నారు. వీటిని ఎక్కువగా తినే ఆహారంలో చేర్చుకోవడం వల్ల వ్యాధుల ప్రమాదం కూడా అనేక రెట్లు పెరుగుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)