Banana Leaves : అరటి ఆకులో ఇంత శక్తి ఉందా..? ఇందులో తింటే ఈ సమస్యలన్నీ మాయం!

|

May 30, 2024 | 11:33 AM

అరటి ఆకుల రసం తీసి వాడితే దగ్గు, జలుబు తగ్గుతాయి. వీటిని తీసుకోవడం వల్ల సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అరటి ఆకులను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. చర్మ సంబంధిత సమస్య ఏదైనా ఉంటే అరటి ఆకు పేస్ట్‌ను రాసుకుంటే వెంటనే తగ్గుతుంది. అంతేకాదు.. అరటి ఆకులో భోజనం చేయటం వల్ల..

Banana Leaves : అరటి ఆకులో ఇంత శక్తి ఉందా..? ఇందులో తింటే ఈ సమస్యలన్నీ మాయం!
Banana Leaves
Follow us on

మన చుట్టూ ఉన్న అనేక చెట్లు, మొక్కలు ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అదేవిధంగా అరటి చెట్టుకు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఆయుర్వేద దృక్కోణంలో, అరటి మొక్క చాలా ముఖ్యమైనది. అరటిపండు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇది శరీరానికి శక్తినిచ్చి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల బలహీనతను దూరం చేస్తుంది.

ప్రస్తుతం చాలా చోట్ల అరటి ఆకుల్లో ఆహారం తినటం అలవాటుగా చేసుకుంటున్నారు. అరటి ఆకుల్లో సహజసిద్ధమైన ఐరన్ కంటెంట్ ఉంటుంది. వాటిని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అరటి ఆకులను తీసుకోవడం వల్ల వాటిలోని ఔషధ గుణాలు శరీరానికి మేలు చేస్తాయి. అర‌టి ఆకులో భోజ‌నం చేయ‌డం వల్ల అది వంట‌కాల రుచిని, ఫ్లేవ‌ర్‌ను పెంచుతుంది. అర‌టి ఆకులు స‌హ‌జ‌మైన డిస్ఇన్ఫెక్టెంట్‌గా చెబుతారు. ఇవి ఆహారంలో ఉన్న హానికార‌క బ్యాక్టీరియాను న‌శించేలా చేస్తాయి.

అర‌టి ఆకుల్లో పాలీపెనాల్స్‌, విట‌మిన్ ఏ, విట‌మిన్ సీ వంటి అత్య‌వ‌స‌ర పోష‌కాలు శ‌రీరానికి మేలు చేస్తాయి. అర‌టి ఆకుపై భోజ‌నం వ‌డ్డించ‌గానే ఆకులోఉండే ఈ పోష‌కాల్లో కొన్ని ఆహారంలోకి చేరతాయి. కొన్ని సింథ‌టిక్ ప్లేట్ల‌తో పోలిస్తే అర‌టి ఆకులు ఎలాంటి టాక్సిన్స్‌ను, హానికారక కెమిక‌ల్స్‌ను ఆహారంలోకి విడుద‌ల చేయ‌వు.

ఇవి కూడా చదవండి

అర‌టి ఆకుల్లో భోజ‌నం చేయ‌డం ద్వారా జీర్ణ‌క్రియ స‌జావుగా సాగుతుంది. అర‌టి ఆకుల్లో ఉండే పాలీపెనాల్స్ డైజెస్టివ్ ఎంజైమ్స్‌ను ప్రేరేపించ‌డం ద్వారా జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రిచి పోష‌కాల‌ను మెరుగ్గా గ్ర‌హించేలా చేస్తాయి. ఇవి మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి అనారోగ్యాల బారి నుంచి రక్షిస్తాయి. పార్కిన్సన్ వ్యాధికి చికిత్స చేయగల ఎంజైమ్ పాలీఫెనాల్ ఆక్సిడేస్ అరటి ఆకుల్లో ఉంటుందట.

అరటి ఆకుల రసం తీసి వాడితే దగ్గు, జలుబు తగ్గుతాయి. వీటిని తీసుకోవడం వల్ల సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అరటి ఆకులను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. చర్మ సంబంధిత సమస్య ఏదైనా ఉంటే అరటి ఆకు పేస్ట్‌ను రాసుకుంటే వెంటనే తగ్గుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..