ఇంటి కోసం షాపింగ్ చేసేటప్పుడు చాలా విషయాలు గుర్తించుకోవాలి. ముఖ్యంగా డబ్బును ఆదా చేసేవిధంగా షాపింగ్ చేయాలి. ఇంట్లో కావాల్సిన వస్తువులు, సరుకులు కొనేటప్పుడు బడ్జెట్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలి. వారానికి లేదా నెలకు సరిపడా కొంత బడ్జెట్ వేసుకుని.. వాటిల్లో అవసరం అయినవే తెచ్చుకోవాలి. దీని వల్ల డబ్బు మాత్రమే కాదు సమయం కూడా సేవ్ అవుతుంది. మరి అదెలాగో ఇప్పుడు చూసేయండి.
వారానికి లేదా నెలకు సరిపడా:
చాలా మంది కిరాణా లేదా షాపింగ్ మాల్స్ కి వెళ్లి నప్పుడు ఏవి పడితే అవి కొనేస్తూంటారు. అందులోనూ అక్కడ ఆఫర్లు పెట్టడంలో అవసరం ఉంటాయి కదా అని ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చేస్తారు. ఇలా కాకుండా ముఖ్యంగా మనకు ఎలాంటి సరుకులు కావాలో లిస్ట్ రాసుకోవాలి. అలాగే ఎంత క్వాంటిటీ సరుకులు మనకు సరిపోతున్నాయో చూసుకోవాలి. ఇలా నోట్ చేసుకోవడం వల్ల అవసరం అయినవి మాత్రమే తీసుకుంటాం. ఇలా నెలకి లేదా వారానికి సరిపడా సరుకులు తీసుకోవడం వల్ల.. క్వాంటిటీ గురించి కూడా అవగాహన వస్తుంది.
ఎక్కువ మొత్తంలో కొనకూడదు:
ముఖ్యంగా మన బడ్జెట్ బట్టి నెలకు ఎంత మేర సరుకులు కావాలో అలా తెచ్చుకుంటే సరిపోతుంది. ఆఫర్లు ఉన్నాయి కదా అని ఎక్కువ మొత్తంలో తెచ్చుకుని స్టోర్ చేయడం వల్ల అవి పాడైపోతాయి. ముఖ్యండా డైరీ ఐటెమ్స్. వీటిని ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తెచ్చుకుంటేనే బెటర్. లేదంటే పాడైపోతాయి. దీంతో డబ్బు కూడా వృథా అవుతుంది. కాబట్టి వీటీని గుర్తు పెట్టుకోవాలి.
ఎక్స్ పైరీ డేట్ చూసుకోవాలి:
కొంత మంది ఆఫర్లు ఉన్నాయి కదా అని ముందూ వెనక చూడకుండా కొనేస్తారు. కానీ ఎప్పుడైతే సరుకులు ఆఫర్లో పెట్టారో అప్పుడు ఖచ్చితంగా ఎక్స్ పైరీ డేట్ చూసుకుని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల సరుకులు పాడవకుండా ఉంటాయి. ముఖ్యంగా తిను బండారాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా చూడండి.
క్యారీ బ్యాగ్స్ క్యారీ చేయాలి:
సరుకుల నిమిత్తం కొనడానికి వెళ్లినప్పుడు ఖచ్చితంగా అవసరం అయినన్ని క్యారీ బ్యాగ్స్ తీసుకెళ్లడం చాలా బెటర్. లేదంటే అక్కడ క్యారీ బ్యాగ్స్ కి కూడా డబ్బులు చెల్లించి కొనాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇంటి నుంచే తీసుకెళ్తే ఆ డబ్బు కూడా సేవ్ అవుతుంది. ఇలా మన బడ్జెట్ బట్టి.. డబ్బును వృథా చేయకుండా షాపింగ్ చేయవచ్చు.