Lifestyle: మీరు వాడుతోన్న జీలకర్ర అసలా.? నకిలీనా.? ఇలా తెలుసుకోండి..

|

Apr 05, 2024 | 3:05 PM

గుజరాత్‌లోని ఉంజా అనే పట్టణంలో నకిలీ జీలకర్ర తయారు చేస్తున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నకిలీ జీలకర్రకు సంబంధించి అందరిలో ఆందోళన నెలకొంది. ఇంతకీ నకిలీ జీలకర్రను ఎలా తయారు చేస్తున్నారు.? దీనిని ఎలా గుర్తించాలి.? ఇప్పుడు తెలుసుకుందాం...

Lifestyle: మీరు వాడుతోన్న జీలకర్ర అసలా.? నకిలీనా.? ఇలా తెలుసుకోండి..
Fake Cumin
Follow us on

కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్లు పరిస్థితి మారిపోయింది. ఎలాగైనా డబ్బులు సంపాదించాలని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. మనుషుల ఆరోగ్యాలు, ప్రాణాలు ఏమైపోయినా పర్లేదు కానీ తమ జేబులు నిండితే చాలని భావిస్తున్నారు. ఉప్పు నుంచి పప్పు వరకు, కారం నుంచి చక్కెర వరకు అన్నింటినీ కల్తీ చేస్తున్నారు. అడపాదడపా ఇలాంటి కల్తీ వస్తువులకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా నకిలీ జీలకర్ర అంశం కలవరపెడుతోంది.

గుజరాత్‌లోని ఉంజా అనే పట్టణంలో నకిలీ జీలకర్ర తయారు చేస్తున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నకిలీ జీలకర్రకు సంబంధించి అందరిలో ఆందోళన నెలకొంది. ఇంతకీ నకిలీ జీలకర్రను ఎలా తయారు చేస్తున్నారు.? దీనిని ఎలా గుర్తించాలి.? ఇప్పుడు తెలుసుకుందాం. కొందరు కేటుగాళ్లు గడ్డిబెల్లం, రాతిపొడి, మట్టితో నకిలీ జీలకర్రను తయారు చేస్తుంటారు. అచ్చంగా నిజమైన జీలకర్రలా కనిపించేలా దీనిని తయారు చేస్తున్నారు.

వీటిని అసలు జీలకర్రలో కలిపేసి అమ్మేస్తున్నారు. ఇవి తిన్న వారు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇంతకీ నకిలీ జీలకర్రను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా జీలకర్రను తీసుకొని చేతిలో వేసుకోవాలి. అనంతరం మరో బొటనవేలుతో జీలకర్రను గట్టిగా రుద్దాలి ఆ సమయంలో జీలకర్ర సులభంగా కరిగిపోయి మట్టిపైకి తేలితే అది నకిలీ జీలకర్ర అని అర్థం చేసుకోవాలి. అలాగే కొంత జీలకర్రలో మంచి నీరు పోసి రుద్దితే జీలకర్ర నీటిలో కరిగిపోయినా అది నకిలీ జీలకర్రగా అర్థం చేసుకోవాలి.

ఇక నకిలీ జీలకర్ర బారిన పడకూడదంటే ప్యాకెట్ల రూపంలో అందుబాటులో ఉన్న జీలకర్రను తీసుకోవాలి. అందులోనూ కొన్ని ప్రముఖ కంపెనీలకు చెందిన బ్రాండ్స్‌ అయితే నకిలీ జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాకాకుండా లూజ్‌గా లభించే జీలకర్రలో కల్తీ జరిగే అవకాశాలు ఉంటాయని గుర్తు పెట్టుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..