kitchen tips: మీరు వాడుతోన్న నూనె అసలా, కల్తీనా.? ఇలా తెలుసుకోండి..

|

Jun 10, 2024 | 12:58 PM

మార్కెట్లో కల్తీ రాజ్యమేలుతోంది. వ్యాపారులు అత్యాశతో ప్రతీ వస్తువును కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నూనె లేనిది రోజు గడవని పరిస్థితి ఉంటుంది. అలాంటి నిత్యవసరమైన నూనె కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. ఇలాంటి కల్తీ నూనె తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు...

kitchen tips: మీరు వాడుతోన్న నూనె అసలా, కల్తీనా.? ఇలా తెలుసుకోండి..
Fake Oil
Follow us on

మార్కెట్లో కల్తీ రాజ్యమేలుతోంది. వ్యాపారులు అత్యాశతో ప్రతీ వస్తువును కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నూనె లేనిది రోజు గడవని పరిస్థితి ఉంటుంది. అలాంటి నిత్యవసరమైన నూనె కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. ఇలాంటి కల్తీ నూనె తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హృద్రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మరి కల్తీ నూనెను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* కల్తీ లేని నూనె అయితే దానికి ఎలాంటి సువాసన ఉండదని గుర్తుంచుకోవాలి. ఇందుకోసం ముందుగా నూనె కాస్త చేతికి రుద్దుకొని వాసన చూడాలి. ఒకవేళ అది కల్తీ నూనె అయితే సువాసన వస్తుంది. కల్తీ నూనె కొద్దిగా మబ్బుగా ఉంటుంది. స్వచ్ఛమైన నూనెలకు స్పష్టత ఉంటుంది.

* ఆలివ్‌ నూనె బంగారు ఆకుపచ్చ, పొద్దుతిరుగుడు నూనె లేత పసుపులో ఉంటాయి. స్వచ్ఛమైన నూనెలు సహజమైన రుచిని కలిగి ఉంటాయి. కల్తీ నూనె రంగులో కూడా మార్పు గమనించవచ్చు. రంగులో ఏదైనా తేడా కనిపిస్తే కల్తీ నూనె అని అర్థం చేసుకోవాలి.

* మీరు ఉపయోగిస్తున్న నూనె నాణ్యమైందో కాదో తెలుసుకోవాలంటే.. ముందుగా గిన్నెలో కొంచెం నూనె పోసి ఫ్రీజర్‌లో ఉంచాలి. ఒకవేళ మీరు వాడుతోన్న నూనె స్వచ్ఛమైనదైతే, అది గడ్డగా మారుతుంది. లేదంటే.. ద్రవ రూపంలోనే ఉంటుంది. 30 నిమిషాల్లోగా గడ్డ కడితే అది నాణ్యమైన నూనె అని అర్థం.

* ఒక తెల్ల కాగితాన్ని తీసుకొని కొద్దిగా నూనె రాసి ఆరబెట్టాలి. నూనె స్వచ్ఛంగా ఉంటే, అది వృత్తంలా వ్యాపిస్తుంది. ఇది నకిలీ నూనె అయితే, అది ప్రవహిస్తుంది దీని బట్టి మీరు వాడేది నకిలీ నూనెనా.? అసలైందా.? అర్థం చేసుకోవచ్చు.

* ఇక మీరు ఉపయోగిస్తున్న కొబ్బరి నూనె స్వచ్ఛమైందో కాదో తెలుసుకోవడానికి కూడా ఇక ట్రిక్‌ ఉంది. ఇందుకోసం ఒక గిన్నెలో కొంచెం కొబ్బరి నూనెను తీసుకుని 60 నుంచి 90 నిమిషాల పాటు ఫ్రీజర్‌లో ఉంచండి. మంచి స్వచ్ఛమైన నూనె అయితే చిక్కగా ఉంటుంది. కల్తీ అయితే పైభాగం మాత్రమే ఘనంగానూ కింది భాగం ద్రవంగానూ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..