Mamidi Tandra: ఇంట్లోనే మామిడి తాండ్రను ఇలా చేసుకోండి.. సింపుల్ స్టెప్స్‌

|

Jun 07, 2024 | 7:11 PM

వేసవి కాలం ముగిసింది, ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలవుతున్నాయి. వేసవిలో విస్తృతంగా కనిపించిన మామిడి పండ్లు ఇప్పుడు క్రమంగా కనుమరుగవుతున్నాయి. మరి మామిడి పండ్లు లేకపోయినా ఏడాదంతా వాటి రుచిని ఆస్వాదించేందుకు ఓ మార్గం ఉంది.. అదే మామిడి తాండ్ర. మామిడి పండ్ల గుజ్జుతో తయారు చేసే మామిడి తాండ్రాను చాలా మంది ఇష్టంగా తింటారు..

Mamidi Tandra: ఇంట్లోనే మామిడి తాండ్రను ఇలా చేసుకోండి.. సింపుల్ స్టెప్స్‌
Mango Tandra
Follow us on

వేసవి కాలం ముగిసింది, ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలవుతున్నాయి. వేసవిలో విస్తృతంగా కనిపించిన మామిడి పండ్లు ఇప్పుడు క్రమంగా కనుమరుగవుతున్నాయి. మరి మామిడి పండ్లు లేకపోయినా ఏడాదంతా వాటి రుచిని ఆస్వాదించేందుకు ఓ మార్గం ఉంది.. అదే మామిడి తాండ్ర. మామిడి పండ్ల గుజ్జుతో తయారు చేసే మామిడి తాండ్రాను చాలా మంది ఇష్టంగా తింటారు. కేవలం రుచికి మాత్రమే పరిమితం కాకుండా ఆరోగ్యానికి కూడా మామిడి తాండ్రా ఎంతగానో ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా తాండ్రాలో విటమిన్లు, ఖనిజాలు, లవణాలు పుష్కలంగా లభిస్తాయి. దీనివల్ల జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. మామిడి తాండ్ర ప్రస్తుతం అన్ని రకాల దుకాణాల్లో అందుబాటులోకి వస్తున్నాయి. బడా కంపెనీలు సైతం వీటిని తయారు చేస్తున్నాయి. అయితే ఇంట్లోనే ఎంచక్కా తక్కువ ఖర్చులో మామిడి తాండ్రను తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా.? ఇంతకీ మామిడి తాండ్రాను తయారు చేసుకోవడానికి ఏయే వస్తువులు కావాలి.? తయారీ విధానం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

మామిడి తాండ్ర తయారీకి కావాల్సిన పదార్థాలు..

* బాగా పండిన రెండు మామిడి పండ్లు.

* చక్కెర ఒక కప్పు.

* ఒక టేబుల్‌ స్పూన్ నిమ్మరసం.

* ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి.

తయారీ విధానం..

మామిడి తాండ్ర తయారీ చేయడానికి ముందుగా బాగా పండిన రెండు మామిడి పండ్లను తీసుకోవాలి. అనంతరం పండులోని గుజ్జును ఒక కప్పులోకి తీసుకోవాలి. అనంతరం అందులో పంచదార వేసి బాగా కలపాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని 30 నిమిషాలు పక్కను పెట్టుకోవాలి. అనంతరం ఒక పాన్‌లో నెయ్యి వేసి వేడి చేయాలి. అంతకు ముందు సిద్ధం చేసుకున్న మామిడి గుజ్జును పాన్‌లో వేసి బాగా కలుపుకోవాలి. గుజ్జు పూర్తిగా వేడెక్కిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసి, మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. అనంతరం చల్లారిన మిశ్రమాన్ని తీసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో నిమ్మరసం పిండుకొని మిశ్రమాన్ని సమానంగా పోయాలి. చివరిగా గుజ్జును ఒక ప్లేట్‌లో సమానంగా పరచాలి. ఆ తర్వాత తాండ్రను ఎండలో 3 నుంచి 4 రోజుల పాటు ఎండబెట్టాలి. తాండ్ర పూర్తిగా ఎండిన తర్వాత చిన్న, చిన్న ముక్కలుగా చేసుకొని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే సరిపోతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..