White Hair
స్త్రీపురుష బేధం లేకుండా అందరూ తమ జుట్టు నల్లగా ఉంచే విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ఇంకా తమ నల్లని జుట్టును తాము అత్యంతగా ఇష్టపడతారు. ఎందుకంటే.. తల వెంట్రుకలు అనేవి మన వ్యక్తిత్వంలో ఒక భాగం.. ఇంకా జుట్టు మనల్ని అందంగా కనిపించేలా చేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జుట్టు రాలడం, చివర్లు చిట్లడం, చుండ్రు లేదా ఇతర సమస్యలను మనం ఎప్పుడో ఒక సారి అయినా ఎదుర్కొనే ఉంటాం. అలాంటి సమస్యలలో అందరినీ ఎక్కువగా వేధించేది తెల్లని లేదా బుడిద రంగులోని జుట్టు.
ఒకప్పటివారికి 30 లేదా 40 సంవత్సరాల తర్వాతే తలలో ఎక్కడో ఒక చోట జుట్టు బూడిద రంగులోకి మారడం ప్రారంభించేది. కానీ ఇప్పటి యువతను చిన్ననాటి నుంచే ఈ సమస్య వెంటాడుతోంది. ఆ సమస్యను అధిగమించడానికి యువత అనేక ప్రయత్నాలు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. డై, కలర్, మెహందీ… ఇలా మార్కెట్లో అన్నీ దొరుకుతాయి. తాత్కాలికంగా అవి కొంత సహకరిస్తాయి. కానీ తెల్లజుట్టు మళ్లీ నల్లబడుతుందా..? అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో మనం తెలుసుకుందాం..
ఎవరికి తెల్ల జుట్టు ఎక్కువగా వస్తుంది..?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుందా.. లేదా.. అని ఆలోచించే ముందు దాని వెనుక ఉన్న కారణాలను మనం తెలుసుకోవాలి. సాధారణంగా పోషకాహార లోపం లేదా చెడు ఆహారం అలవాట్ల కారణంగా ప్రజలు ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అదనంగా కొందరికి జన్యుపరమైన కారణం కూడా ఉంటుంది. వృద్ధాప్యం కారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ఎదుర్కొనవలసిన సమస్యే. కాబట్టి వృద్ధాప్యం వల్ల నల్లని జుట్టు తెల్లగా మారుతుంది. కానీ సరైన జీవనశైలిని అనుసరించడం వల్ల బూడిద జుట్టును ఆలస్యంగా వచ్చేలా చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో తెల్ల జుట్టు నల్లబడవచ్చు. కానీ దీనికి కొంత సమయం పడుతుంది. అయితే ఖచ్చితమైన ఫలితాలు కూడా ఉండవచ్చు.
తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు ఏం చేయాలంటే..
- ముందుగా మీ జుట్టు ఎందుకు తెల్లగా మారుతుందో మీరు తెలుసుకోవాలి. ఏదైనా ఆరోగ్య కారణం ఉంటే తప్పక డాక్టర్‌ను సంప్రదించడం మీకు శ్రేయస్కరం.
- మీకు ఏదైనా పోషకాహార లోపం ఉన్నట్లు డాక్టర్ భావిస్తే, దానికి సరైన ఆహార ప్రణాళికను ఆయన లేదా ఆమె సూచిస్తారు.
- కొబ్బరి నూనె, ఉసిరిని ఉపయోగించడం వల్ల మీ జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఉసిరిలో కొల్లాజెన్‌ను పెంచే శక్తి ఉంది. ఇది జుట్టు పెరుగుదలకు అవసరం, ఇంకా నల్లటి జుట్టును పెంచుతుంది.
- కావాలంటే.. మీరు కొబ్బరి నూనెలో ఉసిరి పొడిని మిక్స్ చేసి కూడా మీ జుట్టుకు మసాజ్ చేయవచ్చు. దీనికి అదనంగా ఉసిరి తినడం కూడా చాలా మంచిది. ఇలా చేయడం వల్ల అంతర్గతంగా నల్లటి జుట్టు పెరగడానికి ఉసిరి సహాయపడుతుంది.
- ఆముదం, ఆలివ్ నూనె జుట్టును నల్లగా మార్చడంలో కూడా సహకరిస్తాయి.
- ఆముదంలో జుట్టు రాలడాన్ని నిరోధించే మంచి ప్రొటీన్లు ఉంటాయి. ఇంకా ఆవపిండిలో ఐరన్, మెగ్నీషియం, సెలీనియం, జింక్, కాల్షియం ఉన్నాయి. ఇవి జుట్టుకు పోషణను అందించడం ద్వారా నల్లబడటానికి సహాయపడతాయి.
- ఆయుర్వేదం ప్రకారం.. గోరింట ఆకులను ఆవనూనెలో వండుకుని, ఆ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే జుట్టు నల్లబడుతుంది.
జుట్టు నెరసిపోకుండా పాటించవలసిన చిట్కాలు..
- మీ జుట్టును ఎక్కువగా కడగకండి.
- జంక్, ఫ్రైడ్, స్పైసీ ఫుడ్స్ తక్కువగా తినండి.
- సోడా, కోలా, ఇతర కార్బోనేటేడ్ డ్రింక్స్‌కు దూరంగా తప్పనిసరిగా మానుకోండి.
- నూనెతో వారానికి రెండు మూడు సార్లు తలస్నానం చేయండి.
- రసాయనాలు కలిగిన షాంపూ వంటి ఉత్పత్తులను వాడటం మానుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..