warts: పులిపిర్లతో ఇబ్బంది పడుతున్నారా.? సింపుల్‌గా తొలగించుకోండి..

|

Jul 15, 2024 | 6:52 PM

ముఖమంతా అందంగా ఉండి అక్కడక్కడ కనిపించే పులిపిర్ల వల్ల అందవిహీనంగా కనిపిస్తుంది. అందుకే పులిపిర్లను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మెడ, కనురెప్పలు, చంకల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. అయితే పులిపిర్ల సమస్యను తగ్గించుకోవడానికి చాలా మంది చర్మ సంబధిత వైద్యులను సంప్రదిస్తుంటారు. అయితే పులిపిర్లను సహజంగా...

warts: పులిపిర్లతో ఇబ్బంది పడుతున్నారా.? సింపుల్‌గా తొలగించుకోండి..
Warts
Follow us on

ముఖమంతా అందంగా ఉండి అక్కడక్కడ కనిపించే పులిపిర్ల వల్ల అందవిహీనంగా కనిపిస్తుంది. అందుకే పులిపిర్లను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మెడ, కనురెప్పలు, చంకల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. అయితే పులిపిర్ల సమస్యను తగ్గించుకోవడానికి చాలా మంది చర్మ సంబధిత వైద్యులను సంప్రదిస్తుంటారు. అయితే పులిపిర్లను సహజంగా కూడా తగ్గించుకోవచ్చు. ఇంతకీ పులిపిర్లను సహజంగా తొలగించే ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* పులిపిర్లను తొలగించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిని మెత్తగా చేసి పులిపిర్లపై అప్లై చేయాలి. రాత్రంతా అలానే ఉంచి, ఉదయం కడిగేయాలి. ఇలా క్రమంతప్పకుండా చేస్తే పులిపిర్లు తగ్గుతాయి.

* యాపిల్ సైడర్‌ వెనిగర్‌తో కూడా పులిపిర్లను తొలగించుకోవచ్చు. పులిపిర్లు ఉన్న చోట వెనిగర్‌ను అప్లై చేయాలి. ఇందుకోసం ఒక బౌల్‌లో వెనిగర్‌ను తీసుకొని, కాటన్‌ను అందులో ముంచాలి. అనంతరం పులిపిరి ఉ్న చోట 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇలా క్రమంతప్పకుండా చేస్తే సమస్య తగ్గుతుంది.

* టీట్రీ ఆయిల్‌ కూడా పులిపిర్లను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. దూదిని ఆయిల్‌లో ముంచి పులిపిర్లు ఉన్న చోట అప్లై చేస్తే పులిపిర్ల సమస్య తగ్గుతుంది.

* కలబందలో ఉండే మేలిక్ యాసిడ్ పులిపిర్లలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కలబంద జిగురును తీసి పులిపిర్లపై రాస్తే సమస్య తగ్గుతుంది.

* ఆముదంలో కాస్త బేకింగ్ పౌడర్‌ వేసి వాడినా పులిపిర్లు తగ్గుతాయి. ఈ లిక్విడ్‌ను పులిపిర్లపై రాసి బ్యాండేజ్‌ వేయాలి అలా రాత్రంతా పెట్టాలి. ఇలా చేస్తే పులిపిర్లు తగ్గిపోతాయి.

* అరటిపండు తొక్కతో కూడా పులిపిర్ల సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. అరటిపండు తొక్కలో ఉండే ఎంజైమ్‌లు చర్మానికి మేలు చేస్తాయి. అరటి పండు తొక్కతో రోజు పులిపిర్లపై రుద్దితే అది క్రమేనా కనుమరుగవుతుందని.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..