Skincare Tips: చర్మంపై ముడతలు ఉన్నాయా..? ఈ సౌందర్య చిట్కాలతో అన్ని సమస్యలకు స్వస్తి పలికేయండి..

|

Sep 09, 2023 | 5:53 PM

Skincare Tips: చర్మంపై ముడతలు రావడానికి ఇంకా ఎన్నో కారణాలు ఉన్నా, ఇవి మనిషిలోని ఆత్మవిశ్వాసానికి పెద్ద అడ్డంకిగా మారతాయి. మరి ఈ ముడతలతో మీరు కూడా బాధపడుతున్నారా..? వాటికి చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగా కాస్మటిక్స్ కోసం విపరీతంగా ఖర్చు చేస్తున్నారా..? ఇకపై అలా చేయకుండా.. ఈ హోమ్ రెమెడీస్‌పై దృష్టి సారించండి. ముడతలు పోవడంతో పాటు మెరిసే చర్మం మీ సొంతం..

Skincare Tips: చర్మంపై ముడతలు ఉన్నాయా..? ఈ సౌందర్య చిట్కాలతో అన్ని సమస్యలకు స్వస్తి పలికేయండి..
Remedies For Wrinkles
Follow us on

Skincare Tips: పెరుగుతున్న వయసుతో పాటు చర్మంపై ముడతలు రావడం సహజం. వాతావరణ కాలుష్యం, మెరిసే చర్మం కోసం ఉపయోగించే కాస్మటిక్స్ కూడా ఈ ముడతలకు కారణం కావొచ్చు. చర్మంపై ముడతలు రావడానికి ఇంకా ఎన్నో కారణాలు ఉన్నా, ఇవి మనిషిలోని ఆత్మవిశ్వాసానికి పెద్ద అడ్డంకిగా మారతాయి. మరి ఈ ముడతలతో మీరు కూడా బాధపడుతున్నారా..? వాటికి చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగా కాస్మటిక్స్ కోసం విపరీతంగా ఖర్చు చేస్తున్నారా..? ఇకపై అలా చేయకుండా.. ఈ హోమ్ రెమెడీస్‌పై దృష్టి సారించండి. ముడతలు పోవడంతో పాటు మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఇంతకీ ముడతలను తొలగించుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

గుడ్డులోని తెల్లసొన: అన్ని రకాల పోషకాలకు గుడ్డు మంచి మూలం. గుడ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికే కాక, చర్మానికి కూడా మేలు జరుగుతుంది. ఇందుకోసం మీరు గుడ్డులోని తెల్లసొనను ఒక గిన్నెలోకి తీసుకుని నేరుగా మీ చర్మంపై అప్లై చేయండి. తర్వాత తేలికగా మసాజ్ చేసి 15 నిమిషాల పాటు కూర్చోండి. తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. గుడ్డులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు బి, విటమిన్ ఇ మీ ముఖ చర్మంపై ముడతలను దూరం చేయడంతో పాటు మెరిసేలా చేస్తాయి.

ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ ముడతలకు మరో సహజమైన, ఎఫెక్టివ్ హోం రెమెడీ. పడుకునే ముందు ఈ నూనె చుక్కలను మీ చర్మంపై అప్లై చేసి మసాజ్ చేయండి. తర్వాత టవల్‌తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అనతి కాలంలోనే ముడతలు తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

నిమ్మరసం: విటమిన్ సి, అసిడిక్ గుణాలను పుష్కలంగా కలిగిన నిమ్మకాయ సహజంగానే ముడుతలకు ఉత్తమ చికిత్స. ఈ క్రమంలో మీరు నిమ్మకాయ రసాన్ని ముఖంపై అప్లై చేసి, మసాజ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ముడతలతో పాటు మచ్చలు, మొటిమలు కూడా తొలగిపోతాయి.

అలోవెరా: చర్మ సంరక్షణలో అలోవెరా జెల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో మీరు ముడతలను నియంత్రించడానికి కూడా కలబందను ఉపయోగించవచ్చు. ఇందుకోసం మీరు కలబంద రసాన్ని ముఖంపై అప్లై చేసి, రబ్ చేయండి. తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడిగి వేయండి. కలబందలోని విటమిన్ ఇ ముఖంపై ముడతలను తొలగిస్తుంది.

పైనాపిల్: పైనాపిల్ ఆరోగ్యానికే కాక మీ చర్మానికి కూడా అనేక ప్రయోజనాలను అందించే ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. ఈ ఎంజైములు చర్మపు తేమను మెరుగు పరిచి హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..