రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ఏ రోగం మీ దరి చేరదు .. పాటిస్తే ఫలితం మీరే చూస్తారు..

|

Oct 07, 2023 | 10:45 AM

బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొందరు మధుమేహంతో, మరికొందరు గుండె జబ్బులతో, మరికొందరు ఊబకాయంతో బాధపడుతున్నారు. నిజానికి మన జీవనశైలి, అలవాట్లే ఆరోగ్య సమస్యలకు కారణం. మీరు కూడా ఆరోగ్యంగా జీవించాలనుకుంటే నిపుణులు సూచించిన ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించండి. వ్యాధి రహిత జీవితాన్ని గడపడానికి ఎలాంటి అలవాట్లు పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం.

రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ఏ రోగం మీ దరి చేరదు .. పాటిస్తే ఫలితం మీరే చూస్తారు..
Before Sleep Habits
Follow us on

ఈ రోజు మన జీవన విధానం ఎలా ఉందంటే.. మనం చేసే ప్రతి పనితో మనకు ఏదో ఒక వ్యాధి వస్తుంది. రోజూ ఏదో ఒక సమస్యతో బాధపడే పరిస్థితి మారింది. అందుకోసం రాత్రిపూట కొన్ని పనులు చేస్తూ వ్యాధులకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొందరు మధుమేహంతో, మరికొందరు గుండె జబ్బులతో, మరికొందరు ఊబకాయంతో బాధపడుతున్నారు. నిజానికి మన జీవనశైలి, అలవాట్లే ఆరోగ్య సమస్యలకు కారణం. మీరు కూడా ఆరోగ్యంగా జీవించాలనుకుంటే నిపుణులు సూచించిన ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించండి. వ్యాధి రహిత జీవితాన్ని గడపడానికి ఎలాంటి అలవాట్లు పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఫోన్‌కు దూరంగా ఉండాలి..

నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు పడుకునే ముందు కనీసం 1 గంట ముందు మీ ఫోన్‌ను మీ నుండి దూరంగా ఉంచాలి. ఫోన్ నుండి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు నీలం, పసుపు కాంతికి మీరు దూరంగా ఉండగలిగేతేనే మీలో నిద్ర హార్మోన్ మెలటోనిన్ మీ కోసం పని చేస్తుంది. కాబట్టి మీరు ఆరోగ్యంగా జీవించాలనుకుంటే, రాత్రి పడుకునే ముందు ఫోన్‌ని దూరంగా ఉంచుకోండి.

ఇవి కూడా చదవండి

ఓరల్ హైజీన్..

రాత్రి నిద్రకు పడుకునే ముందు నోటి పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఈ అలవాటు మీ దంతాలను రక్షించడంలో సహాయపడుతుంది. దంతాల నుండి బాక్టీరియా, జెర్మ్స్ సులభంగా తొలగించబడతాయి. అలాగే, నిద్రపోయే ముందు చర్మ సంరక్షణపై కూడా దృష్టి పెట్టాలి. ఇది మీ శరీరంలో అతిపెద్ద అవయవం. పర్యావరణ టాక్సిన్స్ రోజంతా మీ చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీరు దానిని శుభ్రపరిచిన తర్వాత మాత్రమే నిద్రపోవాలి. రాత్రిపూట తలస్నానం చేసి నిద్రపోతే చర్మ ఆరోగ్యం మెరుగై ముడతలు పడవు.

అలాగే, పడుకునే ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోవడం ముఖ్యం. మీరు పడుకునే ముందు డైరీ రాయటం అలవాటు చేసుకోండి.. ఇది మీ ఆలోచనలను మీ మనస్సు నుండి బయటకు తీసుకురావడానికి సహాయపడుతుంది. డైరీలో రోజూ మూడు విషయాలు రాయాలి. ఉదాహరణకు మీకు ఎలా అనిపిస్తుంది? రేపటి కోసం మీ లక్ష్యం ఏమిటి? అలాగే, మీరు చేసిన ప్రతిదాన్ని రాసుకోండి. ఇది మీకు చాలా రిలాక్స్‌గా, హాయిగా అనిపిస్తుంది.

అలాగే, పడుకునే ముందు మిమ్మల్ని మీరు రిలాక్స్‌డ్ గా చేసుకోవాలి.. రోజూ దేశీ నెయ్యితో మడమలకు మసాజ్ చేసుకోండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మనస్సు రిలాక్స్‌గా ఉంటుంది. మడమల పగుళ్లు కూడా రాకుండా నిరోధిస్తుంది. మీరు నిద్రపోయే మందు కొన్ని నిమిషాల పాటు శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయండి. ఇది మీ మనస్సును శాంతపరచడానికి, ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రోజంతా అలసటను దూరం చేసి మంచి నిద్రను అందిస్తుంది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…