Skipping-Running : రన్నింగ్ స్కిప్పింగ్ ల్లో ఏది మంచిది .. ఏది ఎఫెక్టివ్ గా పనిచేస్తుందంటే..

|

Jul 04, 2021 | 11:35 AM

Skipping-Running : కదల కుండా చేసే ఉద్యోగాలు శారీరక శ్రమ లేకుండా చేస్తున్న ఎలక్ట్రానిక్ వస్తువులు .. దీంతో మనిషి శరీరం పని తీరు అదుపు తప్పి.. ఊబకాయం తో పాటు..

Skipping-Running : రన్నింగ్ స్కిప్పింగ్ ల్లో ఏది మంచిది .. ఏది ఎఫెక్టివ్ గా పనిచేస్తుందంటే..
Running Skipping
Follow us on

Skipping-Running : కదల కుండా చేసే ఉద్యోగాలు శారీరక శ్రమ లేకుండా చేస్తున్న ఎలక్ట్రానిక్ వస్తువులు .. దీంతో మనిషి శరీరం పని తీరు అదుపు తప్పి.. ఊబకాయం తో పాటు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ప్రతి ఒక్కరికి శారీరక శ్రమ తప్పని సరని.. చెమట చిందిస్తేనే.. ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా జీవిస్తామని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఊబకాయంతో ఇబ్బందులు పడేవారు ఎక్కువ అయ్యారు. ఇలాంటి వారు తప్పని సరిగా బరువు తగ్గించాల్సిందే.. అధిక కేలరీలను వ్యాయామం చేసి కరిగించాల్సిందే. అందుకు అత్యుత్తమ మార్గం రన్నింగ్, స్కిప్పింగ్ . ఈ రెండు పద్దతులతో చెమట చింది గుండె వేగం పెరుగుతుంది. ఊపిరితిత్తుల సామర్ధ్యం పెరుగుతుంది. అయితే రన్నింగ్ స్కిప్పింగ్ ల్లో చాలా తేడాలున్నాయి. అవేంటో తెలుసుకుని బరువు తగ్గడానికి ఎవరికి ఏది బాగా పనిచేస్తుందో చూద్దాం.

* రన్నింగ్, స్కిప్పింగ్ రెండింటి వల్ల కండరాల మీద భారం పడుతుంది. అయితే రన్నింగ్ చేసే సమయంలో శరీరంలోని కిందిభాగం అటూ ఇటూ కదులుతుంటుంది. భుజాలు, పిరుదుల కదలిక ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చాలా త్వరగా కేలరీలు ఖర్చు అవుతాయి. కాకపోతే స్కిప్పింగ్ చేసేటపుడు పిరుదులు సాధారణంగా ఉండి, వెన్నెముక చివరి భాగం మీద భారం పడుతుంది.
*రన్నింగ్ తో పోలిస్తే స్కిప్పింగ్ చేసేసమయంలో శరీరం అధిక శ్రమకు గురవుతుంది. దీంతో స్కిప్పింగ్ 10నిమిషాలు చేస్తే 15కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. 10నిమిషాల రన్నింగ్ చేస్తే 125కేలరీలు కరిగితే.. అదే 10నిమిషాల పాటు స్కిప్పింగ్ లో 140కేలరీలు కరుగుతాయి.

అయితే శరీరం అధిక బరువు తగ్గడానికి ఎవరు స్కిప్పింగ్ , ఎవరు రన్నింగ్ చేస్తే మంచిదంటే..

నిజానికి మోకాలు, మడమ, నడుము నొప్పి ఉన్నవారికి రన్నింగ్, స్కిప్పింగ్ రెండూ మంచి వ్యాయామాలు కావు. ఈ వ్యాయామాల వలన ఆ ఇబ్బందులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి ఇబ్బందులు పడే వారు రన్నింగ్ కు బదులు నడక, చిన్నపాటి పరుగు ను ఎంచుకోవాలి. ఇక స్కిప్పింగ్ విషయానికి వస్తే రెండు కాళ్ళమీద ఒకేసారి దూకడం కాకుండా, ఒకే కాలుతో దూకడం చేయవచ్చు. ఈ రెండు వర్కౌట్లలో ఏది చేయాలన్న విషయానికి వస్తే, తక్కువ సమయం ఉన్నవారు రన్నింగ్ కంటే స్కిప్పింగ్ ను ఎంచుకుని వ్యాయామం చేస్తేనే ఆరోగ్యానికి మంచిది.

Also Read: తనను ఆహారంగా తిందామనుకున్న కప్పకు చుక్కలు చూపించిన కందిరీగ.. వైరల్ వీడియో