Home Remedies: తెల్ల జుట్టుని నల్లగా, ఒత్తుగా పొడవుగా చేసుకోవడానికి వంటింట్లో ఉండే వస్తువులతో నేచురల్ టిప్స్

| Edited By: Anil kumar poka

Jun 06, 2021 | 7:26 PM

Home Remedies: మారుతున్న కాలంతో పాటు మనుషుల ఆహార వ్యవహారాల్లో కూడా మార్పు వచ్చింది. దీంతో స్త్రీ, పురుషులలో వయసుతో సంబంధం లేకుండా జుట్టు తెల్లబడుతూ..

Home Remedies: తెల్ల జుట్టుని నల్లగా, ఒత్తుగా పొడవుగా చేసుకోవడానికి  వంటింట్లో ఉండే వస్తువులతో  నేచురల్ టిప్స్
Balckj Hair
Follow us on

Home Remedies: మారుతున్న కాలంతో పాటు మనుషుల ఆహార వ్యవహారాల్లో కూడా మార్పు వచ్చింది. దీంతో స్త్రీ, పురుషులలో వయసుతో సంబంధం లేకుండా జుట్టు తెల్లబడుతూ పెద్ద సమస్యగా మారింది.. ఆయితే ఇలా తెల్లబడిన జుట్టు సమస్యను నేచురల్ గా మరియు శాశ్వతంగా నివారించుకోవాలని మీరు అనుకుంటే కొన్ని హోం రెమెడీలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.

1. గోధుమలు: తెల్ల జుట్టును నివారించడంలో ఇది ఒక బెస్ట్ నేచురల్ క్యూర్. గోధుమపిండితో అల్లం మిక్స్ చేసి దానికి ఒక స్పూన్ తేనె మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఒక వారంలో జుట్టులో మార్పు కనిపిస్తుంది.

2. కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం వేసి దీనిని వాటర్ లా బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి మసాజ్ చేయాలి . ఇది తెల్ల జుట్టుకు మసాజ్ థెరఫీలా పనిచేసి తెల్ల జుట్టును నివారిస్తుంది.

3. హెన్న: గోరింటాకు మీ జుట్టుకు నేచురల్ కలర్ ను అందిస్తుంది . ఇది తలకు ఒక నేచురల్ షైనీ కలర్ అందివ్వడం మాత్రమే కాదు, డ్యామేజ్ జుట్టును నివారిస్తుంది.

4. ఉసిరి: ఉసిరికాయను ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టాలి. ఎండిన ఉసిరికాయ ముక్కల్ని నూనెకు మిక్స్ చేయాలి. ఇప్పుడు నూనెను వేడి చేసి గోరువెచ్చగా అయిన తర్వాత తలకు పట్టించాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే తప్పనిసరిగా జుట్టు నల్లబడుతుంది. అంతేకాదు జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.

5. కరివేపాకు: కరివేపాకులో కొద్దిగా మజ్జిగ మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను స్నానం చేసే నీటిలో మిక్స్ చేసి, ఆ నీటితో తలస్నానం చేయాలి. ఈ పద్దతిని వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

6. క్యారెట్ ఆయిల్: నువ్వుల నూనెతో కొద్దిగా క్యారెట్ ఆయిల్ మిక్స్ చేసి, ఈ కాంబినేషన్ ఆయిల్ ను మీ జుట్టుకు అప్లై చేసి 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

7. మెంతులు : తెల్ల జుట్టును నివారించే మరో సహజ హోం రెమడీ మెంతులు గుప్పెడు మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టి, ఈ నీటిని తలస్నానం చేయడానికి ఉపయోగించండి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే జుట్టు నల్లబడడమే కాదు.. ఒత్తుగా పెరుగుతుంది.

8. నల్ల మిరియాలు: బ్లాక్ పెప్పర్ పౌడర్ ను పెరుగులో మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే, తల తెల్ల జుట్టును మూలాల నుండి తొలగిస్తుంది.

9. బ్లాక్ టీ: ఒక కప్పు బ్లాక్ టీలో ఒక చెంచా ఉప్పు చేర్చి మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుండి తెల్లజుట్టు క్రమంగా తగ్గుతుంది.

Also Read:  సంతానోత్పత్తి, నపుంసకత్వం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా.. రావితో చక్కటి పరిష్కారం అంటున్న ఆయుర్వేదం