మీ జుట్టు ఎక్కువగా రాలిపోయి.. సన్నగా కనిపిస్తుందా ? అయితే మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

|

May 12, 2021 | 1:53 PM

ప్రస్తుత ఉరుకుల పరుగులు జీవన శైలిలో చాలా మందికి ఎదురయ్యే ప్రధాన సమస్య జుట్టు రాలిపోవడం. ఎక్కువ మోతాదులో జుట్టు రాలిపోయి సన్నగా పీలగా కనిపిస్తుంటుంది.

మీ జుట్టు ఎక్కువగా రాలిపోయి.. సన్నగా కనిపిస్తుందా ? అయితే మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
Hair Care Tips
Follow us on

ప్రస్తుత ఉరుకుల పరుగులు జీవన శైలిలో చాలా మందికి ఎదురయ్యే ప్రధాన సమస్య జుట్టు రాలిపోవడం. ఎక్కువ మోతాదులో జుట్టు రాలిపోయి సన్నగా పీలగా కనిపిస్తుంటుంది. ఈ సమస్యను తగ్గించడానికి అనేక రకాల ఆయిల్స్, కెమికల్ షాంపూలను వాడుతుంటారు. ఫలితంగా సమస్య తగ్గడం కాదు కదా మరింత ఎక్కువయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇక జుట్టు రాలిపోవడానికి కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి. అవి జీవన విధానంలో మార్పులు, సరైన పోషణ లేకపోవడం, జుట్టు సంరక్షణ ఉత్పత్తులు వాడకం మితిమీరడం, రసాయనాలు ఉన్న ఉత్పత్తులు వాడడం కూడా కారణాలు చెప్పుకోవచ్చు. అయితే ఈ సమస్యకు కొన్ని సహజమైన పద్ధతులలో చెక్ పెట్టవచ్చు. మీ ఇంట్లో దొరికే పదార్థాలతో జుట్టు రాలిపోయే సమస్యను తగ్గించవచ్చు. అవెంటో తెలుసుకుందామా.

కలబంద జెల్.. ఇది జుట్టు, చర్మ సమస్యలను తగ్గించే మెరుగైన ఔషదం. కలబంద జెల్ ను నేరుగా తలకు అప్లై చేసి 30 నిమిషాలు వదిలేయ్యాలి. ఆ తర్వాత చల్లటి నీటితో జుట్టును కడిగేయాలి. ఇలా ఎక్కువ సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఇవే కాకుండా.. కలబంద్ జెల్ కు కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ కలిపి వారానికి ఒకటి రెండు సార్లు అప్లై చేస్తే ఫలితం కనిపిస్తుంది.

పోషకాహరం.. ఎక్కువగా కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు ఉన్న ఆహారం తీసుకోవడం జుట్టు సహజత్వాన్ని కోల్పోకుండా ఉంటుంది. అలాగే మందంగా పెరుగుతుంది. ఇందులో భాగంగా గుడ్లు, వాల్ నట్, బాదం, పెరుగు, చిక్కుళ్ళు, బీన్స్ వంటి రోజూవారీ డైట్ లో చేర్చుకుంటే ఫలితం ఉంటుంది.

ఆలివ్ నూనె.. ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా శరీరానికి కూడా మేలు చేస్తాయి. తలకు ఆలివ్ నూనెను అప్లై చేస్తే జుట్టు మృదువుగా, పొడిబారకుండా ఉంటుంది. వెచ్చని ఆలివ్ నూనె వేడి చేసి, తలమీద మరియు జుట్టు మీద 30-45 నిమిషాలు వర్తించు, తరువాత తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోండి.

గుడ్లు.. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. గుడ్డులోని తెల్లసోనను నేరుగా తలపై అప్లై చేసి 30 నిమిషాలు వదిలేయ్యాలి. ఆ తర్వాత షాంపూతో కడిగేయ్యాలి. అలాగే గుడ్డు పచ్చసొన, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నీటితో కలపాలి. దీనిని తలపై అప్లై చేసి కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వలన జుట్టు సమస్య తగ్గుతుంది.

Also Read: Allu Arjun: బన్నీ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. కరోనాను జయించిన అల్లు అర్జున్.. అఫీషియల్ ట్వీట్..