Neck Darkness: మీ మెడ చుట్టూ నలుపా… అయితే ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే…!

Neck Darkness: శారీరక అందం కంటే.. మానసిక అందం గొప్పది అంటూ ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా.. ఎవరైనా కొత్తవారు కనిపిస్తే.. వారిలో మనల్ని ముందుగా ఆకట్టుకునేది...

Neck Darkness: మీ మెడ చుట్టూ నలుపా... అయితే ఈ సింపుల్ చిట్కాలు  మీ కోసమే...!
Dark Neck

Updated on: May 02, 2021 | 4:17 PM

Neck Darkness: శారీరక అందం కంటే.. మానసిక అందం గొప్పది అంటూ ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా.. ఎవరైనా కొత్తవారు కనిపిస్తే.. వారిలో మనల్ని ముందుగా ఆకట్టుకునేది.. వారి ముఖ వర్చస్సు.. అవును అందం అందరినీ ఆకర్షిస్తుంది. అయితే కొంతమందికి శరీరంలోని అన్ని భాగాలు తెల్లగా ఉన్నా… మెడ చుట్టూ నల్లగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలో ఈ సమస్య ఉంటె.. కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడతారు. నగలు వేసుకునే సమయంలో .. నేక్ దుస్తులు వేసుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అయితే ఈ సమస్యను చాలా సులభంగా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే చెక్ పెట్టవచ్చు.. అవి ఏమిటో ఇపుడు చూద్దాం..!

మెగా చుట్టూ ఉన్న నలుపును తగ్గించుకోవడానికి మంచి సహాయకారిగా పనిచేస్తుంది బాదం. బాదంలో ఉండే విటమిన్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.

అరస్పూన్ బాదం పొడిలో ఒక స్పూన్ పాల పొడి, ఒక స్పూన్ తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో ఉంచి తీసి మెడకు రాసుకొని మర్దన చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా రోజూ చేస్తే.. ఒక 15 రోజుల్లోనే మీ మెడ రంగు సహజంగా మారుతుంది.

కలబంద చర్మానికి తేమను అందించటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. ప్రతి రోజు కలబంద గుజ్జును మెడకు ప్యాక్ వేసుకోవాలి. ఇరవై నిముషాలు మృదువుగా మర్దన చేసి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పచ్చి పాలను తీసుకుని దూది అందులో ముంచి.. ఆ పాలను మెడ మీద నలుపు ఉన్న ప్రాంతంలో రుద్దితే.. తర్వాత శనగపిండి, బియ్యంపిండి తేనే కలిపినా మిశ్రమాన్ని అప్లై చేసి.. కొంచెం సేపటి తర్వాత చల్లటి నీటితో కడిగితే నలుపు తగ్గుతుంది.

Also Read: మలయాళంలో కార్తీకదీపం సీరియల్ ముగింపునే తెలుగులో ఇస్తే.. వంటలక్క ఫ్యాన్స్ ఆదరిస్తారా..!