Dark Mehndi Tips: గోరింట మందారంలా పండాలంటే ఈ సింపుల్ చిట్కాలను పాటించండి..

| Edited By: Surya Kala

Jul 10, 2021 | 8:14 PM

Dark Mehndi Tips: ఆషాడం వచ్చింది అమ్మాయిల చేతులు గోరింటాకుతో చేతులు ఎర్రగా ముద్దమందారంలా పండి ముద్దుస్తుంటాయి. అయితే ఈ గోరింటాకు అందాన్ని మాత్రమే కాదు..

Dark Mehndi Tips: గోరింట మందారంలా పండాలంటే ఈ సింపుల్ చిట్కాలను పాటించండి..
Mehandi
Follow us on

Dark Mehndi Tips: ఆషాడం వచ్చింది అమ్మాయిల చేతులు గోరింటాకుతో చేతులు ఎర్రగా ముద్దమందారంలా పండి ముద్దుస్తుంటాయి. అయితే ఈ గోరింటాకు అందాన్ని మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇస్తుంది. మందారంలా పూస్తే మంచి భర్త వస్తాడని.. గోరింటాకు ఎర్రగా పండాలని ప్రతి మగువ కోరుకుంటుంది. ఈరోజు గోరింటాకు ఎర్రగా పండడానికి కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం

* గోరింటాకు పెట్టుకునే ముందు చేతులను శుభ్రం చేసుకోండి. గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఎక్కువ సేపు అలా ఉంచుకోండి. తీసేసేముందు చేతులకు కొబ్బరి నూనె రాసుకుని.. నీటితో మాత్రమే తొలగించండి.
* గోరింటాకు మంచి రంగు రావాలంటే నిమ్మరసం పంచదార కూడా ఉపయోగపడుతుంది. నీటిలో పంచదార వేసి.. కొంచెం సేపు ఆ నీటిని వేడి చేసి.. అది చల్లారిన తర్వాత కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. ఈ నీటిని గోరింటాకు చేతులపై అప్లై చేస్తే.. గోరింటాకు మంచి రంగు వస్తుంది.
* మెహందీ పెట్టుకున్న చేతులకు లంగల పొగను పట్టండి. పాన్ మీద కొన్ని లవంగాలను వేడి చేసి లవంగాల నుండి వచ్చే పొగతో చేతులను ఆవిరి పట్టండి.. చేతులు మంచి రంగును సంతరించుకుంటాయి.
*మెహందీ పెట్టుకున్న చేతులకు ఆవనూనె లేదా వాజ్ లైన్ ను రాసుకోవడం వల్ల గోరింటాకు రంగు ఎక్కువ కాలం ఉంటుంది.

అయితే ప్రస్తుతం గోరింటాకు పల్లెటూర్లలో మాత్రమే ఎక్కువగా దొరుకుతుంది. అందుకనే సహజ సిద్ధమైన గోరింటాకు దొరకక పొతే కోన్ లను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ కోన్ ను ఉపయోగించేవారు తప్పని సరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. మంచి నాణ్యమైన కోన్ ను ఎంచుకోవాలి

Also Read: ఇంజనీరింగ్ చదివి మీడియాలో అనుభం ఉన్నవారికి భారీ వేతనంతో ఉద్యోగావకాశాలు