Aloe Vera Shampoo: వేసవిలో కలబంద షాంపూతో జట్టు సమస్యలకు చెక్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి

|

Apr 10, 2022 | 12:40 PM

How to make Aloe Vera Shampoo: ఇటీవల కాలంలో చాలామంది జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రసాయనాలు, కాలుష్యం, ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా జుట్టు రాలే సమస్య చాలా పెరిగింది.

Aloe Vera Shampoo: వేసవిలో కలబంద షాంపూతో జట్టు సమస్యలకు చెక్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
Aloe Vera
Follow us on

How to make Aloe Vera Shampoo: ఇటీవల కాలంలో చాలామంది జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రసాయనాలు, కాలుష్యం, ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా జుట్టు రాలే సమస్య చాలా పెరిగింది. ఎండ, వేడి కారణంగా జుట్టు అకాలంగా తెల్లబడటం ప్రారంభమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అదే సమయంలో వేసవిలో జుట్టు సమస్య (Hair Care) మరింత పెరుగుతుందంటున్నారు. చెమటతో జుట్టు జిగటగా మారుతుంది. దీని కారణంగా పొడి బారి జుట్టు చిట్లిపోతుంది. వేసవిలో జుట్టుకు సంబంధించిన చాలా రకాల సమస్యలు వస్తాయి. ఇలాంటప్పుడు జుట్టుకు తప్పనిసరిగా అలోవెరా జెల్‌ను ఉపయోగించాలని సూచిస్తున్నారు. అలోవెరా జెల్ జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ఇది జుట్టును మృదువుగా.. సిల్కీగా మార్చుతుంది. మీరు కావాలనుకుంటే ఇంట్లోనే కలబంద షాంపూని తయారు చేసుకోవచ్చు. ఇది మీ జుట్టుకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. షాంపూ చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.

అలోవెరా జెల్‌తో షాంపూ తయారీ విధానం..

∙ కలబంద షాంపూ చేయడానికి ముందుగా పాన్ లేదా గిన్నె తీసుకోండి.

∙ అందులో నీరు – సువాసన కోసం మీకు ఇష్టమైన సబ్బు లేదా షాంపూ వేయండి.

∙ సబ్బు కరిగిన తర్వాత తాజా కలబంద జెల్‌ను వేయండి.

∙ ఇప్పుడు మీరు దానికి విటమిన్ ఇ, జోజోబా నూనెను జోడించండి.

∙ వీటిని బాగా గ్రైండ్ చేయండి.

∙ ఇప్పుడు ఈ సబ్బు-కలబంద మిశ్రమాన్ని ఒక గిన్నెలో లేదా డబ్బాలో నిల్వ ఉంచవచ్చు.

∙ ఈ షాంపూని తయారు చేయాలనుకుంటే సబ్బుకు బదులుగా తేలికపాటి షాంపూను కూడా ఉపయోగించవచ్చు.

∙ ఈ షాంపూని ఉపయోగించే ముందు బాటిల్‌ను బాగా షేక్ చేయాలి.

∙ ఈ షాంపూని జుట్టుకు బాగా పట్టించి సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇంట్లో తయారుచేసిన అలోవెరా షాంపూ వల్ల కలిగే ప్రయోజనాలు

➼ అలోవెరా షాంపూ జుట్టును మృదువుగా మార్చి ఆరోగ్యంగా చేస్తుంది. వేసవిలో ఈ షాంపూ జుట్టును తేమగా ఉండేలా చేస్తుంది.

➼ అలోవెరా షాంపూని ఉపయోగించడం ద్వారా పొడి జుట్టు సమస్య దూరమవుతుంది.

➼ ఈ షాంపూని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు హైడ్రేటెడ్ గా ఉంటుంది.

➼ అలోవెరా షాంపూని జుట్టుకు అప్లై చేయడం వల్ల కుదుళ్లకు తేమ అంది దురద నుంచి ఉపశమనం లభిస్తుంది.

➼ కలబందలో యాంటీ బ్యాక్టీరియల్ – యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి చుండ్రు సమస్యను తొలగిస్తాయి.

➼ ఈ షాంపూ జుట్టును కండిషన్ చేస్తుంది – జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

➼ అలోవెరా షాంపూని అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా మారి మెరుస్తూ ఉంటుంది.

( ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే.. వీటిని పాటించేముందు నిపుణులను సంప్రదించడం మంచిది.)

Also Read:

Liver Health: ఇవి తీసుకుంటే కాలేయం ప్రమాదంలో పడినట్టే.. అవేంటో తప్పనిసరిగా తెలుసుకోండి..

Mosquito Bites: దోమలు కొందరికి మాత్రమే కుడతాయి.. కారణం ఏమిటి.. పరిశోధనలలో తేలిన నిజాలు!