బాలీవుడ్ స్టైలిష్ విలన్ ‘చుంకీ పాండే’ కూతురిగా హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది అనన్యా పాండే (AnanyaPanday). మొదటి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత ‘పతీ పత్నీ ఔర్ వో’ ‘కాలీ పీలీ’ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువైంది. త్వరలో ‘లైగర్’ (Liger) సినిమాతో తెలుగు సినిమా ప్రియులను కూడా పలకరించబోతోంది. అన్నట్లు ఈ సొగసరికి ఫ్యాషన్ సెన్స్ (Fashion ) కూడా బాగానే ఉంది. అందుకు ఆమె ఇన్ స్టాగ్రామ్ ఫొటోలే ప్రత్యక్ష నిదర్శనం. నిత్యం తన ఫ్యాషనబుల్, గ్లామరస్ ఫొటోలను అందులో పోస్ట్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె నటించిన ఓ డ్రెస్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. చాలామంది ఆ డ్రెస్ ధర ఎం ఉంటుందో? అంటూ ఆరా తీస్తున్నారు.
కాగా ఆమె నటించిన తాజా చిత్రం ‘‘గెహ్రాయియా’. దీపిక పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 11న విడుదల కానుంది. దీంతో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ముంబైలోని ఓ హోటల్‌లో జరిగిన ప్రమోషన్స్‌కి హాజరైంది అనన్య. ఆ కార్యక్రమంలో రెడ్ డ్రెస్‌లో తళుక్కున్న మెరిసింది ఈ తార. ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉన్న ఈ డ్రెస్ ధర సుమారు 1450 అమెరికన్ డాలర్లట. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 1,08,750. కాగా ఈ ఖరీదైన ఆ డ్రెస్‌లో అనన్యని చూసి బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘సూపర్’, ‘లవ్ లీ’ , ‘బ్యూటీఫుల్’ అంటూ లవ్, హార్ట్ ఎమోజీలతో ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.
Megastar Chiranjeevi: మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్.. అభిమాని కుటుంబానికి ఏం చేశారో తెలుసా?
Coronavirus: కరోనా బారిన పడిన రజనీకాంత్ కూతురు ఐశ్వర్య.. ఆస్పత్రిలో చికిత్స..