International Yoga Day: గంటల తరబడి కూర్చోవడం వల్ల భుజాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ యోగాసనం బెస్ట్ రెమిడి

| Edited By: TV9 Telugu

Jun 19, 2024 | 7:04 PM

ఫిట్‌నెస్ విషయానికి వస్తే జిమ్ పేరు మొదట వస్తుంది. అయితే కొన్ని సంవత్సరాల క్రితంలోకి వెళ్తే అసలు జిమ్ అనేది అంతగా ఉపయోగించేవారు కాదు. అప్పట్లో ఫిట్‌గా ఉండేందుకు యోగా, వ్యాయామం సాయం తీసుకునేవారు. నేటికీ చాలా మంది దీనిని అవలంబిస్తున్నారు. యోగా చేయడం కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని కొన్ని ఆసనాలను సులభంగా చేయవచ్చు.

International Yoga Day: గంటల తరబడి కూర్చోవడం వల్ల భుజాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ యోగాసనం బెస్ట్ రెమిడి
Tree Yoga Pose
Follow us on

ప్రస్తుతం మన జీవన విధానంలో రోజురోజుకు అనేక మార్పులు వస్తున్నాయి. దీంతో ఆరోగ్యం దిగజారుతోంది. పని లేదా చదువుల కారణంగా ప్రజలు గంటల తరబడి స్క్రీన్‌లను ఉపయోగిస్తున్నారు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కుర్చుని పని చేసేవారు ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ప్రస్తుతం ఎక్కువమంది సర్వైకల్ వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. అటువంటి పరిస్థితిలో పని సక్రమంగా పూర్తి చేయడం తో పాటు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, శారీరకంగా ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం.

ఫిట్‌నెస్ విషయానికి వస్తే జిమ్ పేరు మొదట వస్తుంది. అయితే కొన్ని సంవత్సరాల క్రితంలోకి వెళ్తే అసలు జిమ్ అనేది అంతగా ఉపయోగించేవారు కాదు. అప్పట్లో ఫిట్‌గా ఉండేందుకు యోగా, వ్యాయామం సాయం తీసుకునేవారు. నేటికీ చాలా మంది దీనిని అవలంబిస్తున్నారు. యోగా చేయడం కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని కొన్ని ఆసనాలను సులభంగా చేయవచ్చు.

చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నవారు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి వ్యాయామం చేయడానికి సమయం దొరకని వ్యక్తులు ఇంట్లో సులభంగా యోగా చేయవచ్చు. అయితే నిపుణుల సలహా తీసుకుని లేదా నిపుణుల పర్యవేక్షణలో యోగా చేయడం ప్రారంభిస్తే.. అది ఎవరికైనా మరింత ప్రయోజనకరంగా ఉంటుందని గుర్తుంచుకోండి.

ఇవి కూడా చదవండి

వృక్షాసనం: ఇంట్లో వృక్షాసనం చేయవచ్చు, దీనిని ట్రీ పోజ్ అని కూడా అంటారు. ఈ యోగాసనం చేయడం ద్వారా భంగిమను మెరుగుపరచుకోవచ్చు. అంతేకాదు కండరాలను బలోపేతం చేస్తుంది. సమతుల్యతను కలిగిస్తుంది, ఒత్తిడిని తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ యోగాసనాన్ని ఉదయం 3 నుండి 4 నిమిషాలు చేయవచ్చు. దీన్ని చేయడం చాలా సులభం. ప్రారంభంలో బ్యాలెన్స్‌ను కొనసాగించడంలో ఇబ్బంది ఉంటుంది. అయితే ప్రయత్నంతో చేయడం సులభం అవుతుంది. శరీరం సమతుల్యంగా మారడం ప్రారంభమవుతుంది.

వృక్షాసనం చేయడానికి సరైన మార్గం
ఈ ఆసనాన్ని ఇంట్లోనే సులువుగా చేయొచ్చు అంటున్నారు యోగా నిపుణురాలు సుగంధ గోయల్.. మందుగా జాగ్రత్తగా పొజిషన్‌లో నిటారుగా నిలబడి.. ఆపై రెండు చేతులను తలపైకి తీసుకుని, దీని తర్వాత రెండు చేతుల వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి అంటే నమస్తే భంగిమలో కలపాలి. ఇలా చేస్తున్న సమయంలో నిటారుగా నిలబడి ఉండాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు దీని తర్వాత ఎడమ కాలు మడమలను ఎత్తి కుడి కాలి మోకాలు మీద పెట్టి.. ఒంటి కాలు మీద నిలబడాలి. ఈ స్థితిలో 10 నుండి 15 సెకన్ల పాటు నిలబడి శ్వాస పీల్చుకోవాలి. ఆపై శ్వాసను వదులుతూ పూర్వ స్థితికి తిరిగి రావాల్సి ఉంటుంది. ఇలా సామర్థ్యాన్ని బట్టి ఈ ఆసనం వేయడానికి సమయాన్ని కేటాయించుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..