సమయం గడిచేకొద్దీ, ఫ్యాషన్ మరియు దుస్తులు గురించి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం తొందరగా రెడీ అవ్వడమే కాకుండా.. వివిధ రకాల అందమైన డ్రెస్సులను వేసుకోవాలని చాలా మంది కోరుకుంటుంటారు. అంతేకాకుండా టైం సేవ్ చేయడానికి ఎంత ప్రయత్నించిన అది మాత్రం సాధ్యం కాదు. ఇక సులభంగా క్షణాల్లోనే రెడీ అయ్యేందుకు అనేక రకాలుగా ట్రై చేస్తుంటారు. ఇక అందంగా కనిపించేందుకు ప్రతి నెల రకారకాల డ్రెస్సెస్ కోనడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. దీంతో అనవసర ఖర్చులు పెరిగిపోతుంటాయి. అలా కాకుండా కొన్ని రకాల దుస్తులు మీ వార్డ్ బోర్డులో ఉంటే నిత్యం తాజాగా కనిపించవచ్చు. అవెంటో తెలుసుకోండి.
బ్లాక్ డ్రెస్ ధరించడం వలన ప్రతి ఒక్కరు అందంగా కనిపిస్తారు. వీటికి క్లాసి లుక్ వచ్చేస్తుంది. ఇక బ్లాక్ కలర్ గౌన్ వేసుకోవడం వలన ఎక్కువగా రెడీ అవ్వాల్సిన పనిలేకుండా.. సింపుల్ క్లాసీగా కనిపిస్తారు. ప్లేన్ బ్లాక్ కాకుండా.. కొన్ని రకాల ప్రింట్లు ఉన్నవి ఎంచుకున్న సరే.
ప్రతి ఒక్కరి వార్డ్ బోర్డులో వైట్ షర్ట్ తప్పనిసరిగా ఉండాలి. వైట్ షర్ట్ లో ఎన్నో రకాల స్టైల్స్ దాగున్నాయి. ఇక వైట్ షర్ట్ పైకి ఎలాంటి కలర్ జీన్స్, లేదా మిడ్డీస్ వేసుకున్నా బాగుంటాయి. కాకపోతే ఈ కలర్ షర్ట్స్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలి.
బ్లాక్ జీన్స్ ధరించడం వలన సన్నగా కనిపించేలా చేస్తుంది. అక ఈ బ్లాక్ జీన్స్ పైకి ఎలాంటి రంగు టాప్స్, షర్ట్ ధరించిన ఇట్టే కలిసిపోతాయి. అలాగే బ్లాక్ క్లాసీ లుక్ ను ఇస్తుంది. ఇక ఈ కలర్ జీన్స్ కాస్త చిరుగులు ఉన్నవి అయితే మరింత స్టైలీష్ గా కనిపిస్తారు.
ప్రస్తుతం చాలా మంది డార్క్ కలర్స్ కాకుండా.. లైట్ కలర్స్ ను ఇష్టపడుతున్నారు. లైట్ కలర్స్ లో ముఖ్యంగా కాఫీ కలర్ మరింత స్టైలీష్ గా.. ప్రకాశవంతంగా కనపిస్తుంటాయి. ఇక ఈ కాఫీ రంగులో ప్లేన్ కాకుండా.. ప్రింట్లు కలిసి ఉండేలా ఎంచుకోవడం ఉంటుంది.
మీ వార్డుబోర్డులో రకారకాల రంగులలో ఉన్న మల్టీకలర్ టీషర్ట్స్ ఉండడం వలన అనవసర ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఇక వీటికి స్థలం కూడా ఎక్కువగా పట్టదు. అలాగే మ్యాచింగ్ సెలక్ట్ చేసుకోవాల్సిన పనిలేదు. మీ టీషర్టులలో ఒక జత డెనిమ్ కూడా అడ్ చేస్తే.. ఇంకా మీకు తిరుగుండదు. మరీ ఆలస్యంమెందుకు మీ సమయం ఆదా చేయడానికి ఈ డ్రెసెస్స్ ను వార్డ్ బోర్డ్ లో పెట్టెయ్యండి.
Also Read:
నీళ్లు ఎక్కువగా తాగితే బరువు తగ్గుతారా ? అధ్యయనాల్లో బయటపడ్డ ఆసక్తికర విషయాలు..