Family Tour: ఎక్కడికైనా దూర ప్రయాణం అంటే కొంతమందికి ఉత్సాహం, మరికొంత మందికి నిరుత్సాహం.. ఊరు వెళ్లాలంటే చాలా మంది ఎగిరి గంతేస్తారు. ఎప్పుడు టైమ్ అవుతుందా అంటూ ముందే రెడీ అయిపోతారు. కాని ఇంకొంతమందికి మాత్రం దూర ప్రయాణం చేయాలంటే చాలా విసుగొస్తుంది. ట్రావెలింగ్ మాట వినిపిస్తే చాలు ఏదో ఒకటి చేప్పి తప్పించుకోవాలనుకుంటారు. అయితే కొన్నిసార్లు ప్రయాణం చేయడం తప్పనిసరవుతుంది. చాలా సందర్భాల్లో కుటుంబంతో ప్రయాణాలు తప్పవు. ఎక్కువ మంది విసుగు చెందేది ప్రయాణం విషయంలోనే ఎందుకంటే రైలు (Train) లో వెళ్దామంటే అనుకున్న సమయానికి టికెట్లు దొరకవు. బస్సులో వెళ్దామంటే దూర ప్రయాణం బస్సులో కష్టం. విమానప్రయాణం అందరికీ సాధ్యం కాదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రయాణం (Travel) పెట్టుకోవాలనుకుంటారు. కాని నేటి ఆధునిక కాలంలో రోజూవారి ఒత్తిడిని అధిగమించడానికి ఏడాదికో, రెండేళ్లకో ఓసారి సరదాగా ఫ్యామిలీ (Family)తో ఏవైనా టూరిస్ట్ ప్లేస్ లకు వెళ్లాలనుకుంటాం. వెళ్లిన తర్వాత.. చాలామంది ప్రయాణంలో ఇబ్బందులు పడతారు. ఫస్ట్ పక్కాగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. మరొకటి ఎక్కడికైనా వెళ్లిన తర్వాత సడన్ గా మనం ప్లాన్ మార్చేసుకుంటాం. కొంతమంది రిటర్న్ టికెట్ లేకుండా ప్రయాణానికి బయలుదేవతారు. ఇలా చేసే సందర్భాల్లో తప్పకుండా చాలా మంది ఇబ్బందులు పడటంతో పాటు, విసుగు చెందుతారు. కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే విసుగు లేకుండా మన ప్రయాణాన్ని విజయవంతం చేసుకోవచ్చు. అవెంటో తెలుసుకుందాం.
ప్లేస్ డిసైడ్ చేసుకోవాలి: ఫ్యామిలీతో టూర్ వెళ్లాలనుకునేటప్పుడు ముందుగా ఏ ప్రాంతానికి వెళ్లాలనేది డిసైడ్ చేసుకోవాలి. ఏదో టూర్ బయలుదేరడానికి కనీసం ఒకటి నుంచి రెండు నెలల ముందు ప్లేస్ డిసైడ్ అయితే దానిని బట్టి టికెట్లు బుక్ చేసుకోవడం సులభం అవుతుంది. లేదా హడావుడిగా ఓ వారం ముందు ఎక్కడికెళ్లాలో డిసైడ్ అయి, టికెట్ల కోసం ప్రయత్నిస్తే దొరకకపోవచ్చు. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ నిరుత్సాహనికి గురయ్యే ఛాన్స్ ఉంది.
ఏ టైంలో వెళ్తున్నామో ముఖ్యం: మనం ఏ ప్రాంతానికి వెళ్లాలనుకుంటున్నామో దానిని బట్టి.. ఏటైంలో అక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్రాంతాలను కొన్ని మాసాల్లో మాత్రమే సందర్శిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉదాహరణకు ఢిల్లీ వెళ్లాలనుకుని డిసైడ్ అయితే దానికి తగిన టైమ్ ను ఎంచుకోవాలి. సాధారణంగా అక్టోబర్ నుంచి మార్చిలోపు ఢిల్లీ వెళ్లేందుకు అనువైన కాలం. ఎండాకాలంలో ఎక్కువ ఎండ ఉంటుంది. చలి కాలంలో చలి ఎక్కువుగా ఉంటుంది. అందుకే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ టూర్ ను ప్లాన్ చేసుకోవాలి. ఇలా మనం వెళ్లాలనుకునే ప్రాంతానికి ఏ సమయంలో వెళ్లడం బెటర్ అనేది తెలుసుకుంటే అక్కడికి వెళ్లిన తర్వాత వాతావరణం కారణంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. లేకపోతే టూర్ లో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది.
ఏ మార్గం బెటర్: మనం వెళ్లాలనుకునే ప్రాంతానికి ఏ మార్గంలో వెళ్తే ఇబ్బందులు ఉండవనేది తెలుసుకోవాలి. కొన్ని ప్రాంతాలకు రైలు మార్గంలో వెళ్తే బెటర్ గా ఉండొచ్చు కొన్ని ప్రదేశాలకు రైలు సౌకర్యం ఉండదు. అక్కడికి బస్సు లేదా సొంత వాహనాల్లో వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఎంత మంది వెళ్లాలనుకుంటున్నాం. ఏ మార్గంలో వెళ్తే త్వరగా చేరుకోగలం. సొంత వాహనానికి, బస్సుకి ఎంత ఖర్చు అవుతుంది. ఇలాంటి లెక్కలు వేసుకుని ప్రయాణానికి బయలుదేరితే మధ్యలో ఎటువంటి సమస్యలు లేకుండా మన ప్రయాణాన్ని సుఖవంతం చేసుకోవచ్చు. రైలులో వెళ్లాలనుకునేటప్పుడు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని పెట్టుకుంటే చివరిలో కంగారు పడాల్సిన అవసరం లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కన్ఫర్మ్ అవుతాయో లేవో అనే టెన్షన్ అవసరం ఉండదు.
బడ్జెట్: టూర్ కు వెళ్లేముందు మనం ఏ ప్రదేశానికి వెళ్తున్నాం. ఎంత మంది వెళ్తున్నాం. మన బడ్జెట్ ఎంత అనేది డిసైట్ అవ్వాలి. ఒకవేళ బడ్జెట్ ను నిర్ణయించుకోకపోతే, అక్కడికి వెళ్లిన తర్వాత ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెడితే తిరిగి వచ్చేటప్పటికి మన జేబు మొత్తం ఖాళీ అయి ఎన్నో ఇబ్బందులు పడటంతో పాటు, ఈటూర్ కి ఎందుకు వెళ్లాం రా బాబు అనిపిస్తుంది. అలా కాకుడదంటే టూర్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తే మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
ముందుగానే రిటర్న్ టికెట్లు: ప్లాన్ లేకుండా టూర్ కు వెళ్లే చాలా మంది వెళ్లేటప్పుడు టికెట్లు దొరికితే చాలు.. వచ్చేటప్పుడు ఏదో ఒకటి చేద్దాం అనే ఉద్దేశంలో ఉంటారు. ఇలా చేయడం వల్ల రిటర్న్ లో టికెట్లు దొరక్క, చాలా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. అనుకున్న సమయానికి మన పర్యటన పూర్తికాదు. అందుకే తప్పనిసరిగా ముందుగానే వెళ్లడానికి, రావడానికి టికెట్లు బుక్ చేసుకోవాలి. ఇలా చిన్న టిప్స్ పాటించడం ద్వారా విసుగు లేకుండా ప్రయాణాన్ని సుఖవంతం చేసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..