Eye Makeup: అమ్మాయిలకు అలర్ట్.. కళ్లకు మేకప్ వేస్తున్నారా..? డేంజర్‌లో పడతారట జాగ్రత్త..

|

Dec 07, 2022 | 8:49 PM

ప్రస్తుతం ట్రెండ్‌ యుగం కొనసాగుతోంది.. చాలామంది అందంగా కనిపించాలనే మోజుతో పలు సౌందర్య ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ మొదలవ్వడంతో వీటి డిమాండ్‌ సైతం పెరిగింది.

Eye Makeup: అమ్మాయిలకు అలర్ట్.. కళ్లకు మేకప్ వేస్తున్నారా..? డేంజర్‌లో పడతారట జాగ్రత్త..
Eye Makeup
Follow us on

ప్రస్తుతం ట్రెండ్‌ యుగం కొనసాగుతోంది.. చాలామంది అందంగా కనిపించాలనే మోజుతో పలు సౌందర్య ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ మొదలవ్వడంతో వీటి డిమాండ్‌ సైతం పెరిగింది. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా.. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈవెంట్‌కు వెళ్లే ముందు తమ రూపాన్ని ఉత్తమంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మేకప్ నుంచి దుస్తుల వరకు ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ, ఈ ప్రక్రియలో హాని కలిగించే అలంకరణ వస్తువులు ఉండటం ఆందోళన కలిగిస్తుంది. సాధారణంగా మహిళలు, యువతులు అందంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. పలు కాస్మోటిక్స్‌ ను ఉపయోగించి మొహం, పెదాలు, కళ్లను మరింత ఆకర్షణీయంగా చేసుకుంటారు. అయితే.. చాలామంది యువతులు ఐ మేకప్‌తో కళ్ల అందాన్ని పెంచుకుంటారు. ఇలా చేయడం కళ్ల ఆరోగ్యంతో ఆడుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంటి అలంకరణకు సంబంధించిన అనేక తప్పులను పునరావృతం చేస్తే.. ఇబ్బందుల్లో పడతారని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కంటి మేకప్ సమయంలో కళ్లను ఆరోగ్యంగా ఉంచే చిట్కాలను అనుసరించడం మంచిది. అవేంటో తెలుసుకుందాం..

కోల్‌ ఐ లైనర్‌ను ఉపయోగించవద్దు..

భారతదేశంలోని మహిళలు కోల్‌ ఐ లైనర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇది కళ్లకు హాని చేస్తుందని నిపుణులు అంటున్నారు. కాజల్‌ని కళ్లకు పట్టించాలంటే ఇంట్లోనే అలాంటి వాటిని తయారుచేసుకుని కంటి అందాన్ని పెంచుకోవాలని సూచిస్తున్నారు.

వాటర్‌ లైన్ ను జాగ్రత్తగా చూసుకోండి

సరైన, మెరుగైన కంటి అలంకరణ చేసే వారు ఎల్లప్పుడూ వాటర్ లైన్‌ను వదిలి మేకప్‌ను ప్రారంభిస్తారు. కళ్ళలోని ఈ ప్రాంతంలో చాలా గ్రంథులు ఉన్నాయి. ఇవి కళ్ళు తెరుచుకోవడం, ఇంకా ద్రవపదార్థాన్ని విడుదల చేయడంలో సహాయపడతాయి. కనురెప్పలతో కంటి అలంకరణ చేయడం వల్ల అవి మూసుకుపోయే ప్రమాదం ఉంది. మీరు ఇన్ఫెక్షన్ బారిన పడకూడదనుకుంటే పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి.

ఇవి కూడా చదవండి

అలెర్జీ లేని ఉత్పత్తులు..

మహిళలు కంటి అలంకరణ కోసం చౌకైన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఇది కళ్ళలో చికాకు లేదా దురదను కలిగిస్తుంది. చర్మానికి హాని కలిగించే ఉత్పత్తులను ఎల్లప్పుడూ ఉపయోగించకండి. ఇటువంటి మేకప్ ఉత్పత్తులకు దూరంగా ఉండటం వల్ల కళ్లకు మేలు జరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..