సాధారణంగా చాలా మందికి మధ్యాహ్నం భోజనం (Mid day Meals) చేసిన తర్వాత నిద్రపోవడం అలవాటు. అయితే అలా నిద్రపోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. 20 నిమిషాల నుంచి అరగంట వరకు నిద్రపోతే పర్వాలేదు గానీ.. గంటల తరబడి నిద్రపోతే రక్తపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. ప్రస్తుతం మారిపోయిన జీవనశైలి కారణంగా అర్థరాత్రి వరకు మెలకువగా ఉండడం, ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం (Sleeping) వంటివి నిత్యకృత్యమయ్యాయి. ఇది తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అందుకే మధ్యాహ్నం లంచ్ (Lunch) చేశాక మనకు మగతగా అనిపించి నిద్రపట్టేసి గంటల తరబడి నిద్రపోతాం. ఫలితంగా రాత్రి పూట సరిగ్గా నిద్రపట్టదు. శరీరానికి సరైన విశ్రాంతి ఉండదు. ఇది మన జీవనచక్రంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. సుమారు 3 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నాలుగు సంవత్సరాల పాటు జరిగిన ఈ అధ్యయనంలో వివధ రకాల పరీక్షలు నిర్వహించి, ఫలితాలు నిర్ధారించారు.
పగటిపూట తరచుగా నిద్రపోయే వారిలో అధిక బరువు పెరిగే అవకాశం ఉందని అధ్యయనం చెబుతోంది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్‌లో సమర్పించిన ఓ పరిశోధనా అధ్యయనం ప్రకారం.. ఎక్కువసేపు నిద్రపోయే వారిలో కార్డియోవాస్కులర్ వ్యాధి 34 శాతం పెరిగినట్లు గుర్తించారు. దీర్ఘకాలం కునుకు తీయడం కంటే.. తక్కువ సమయమే నిద్రపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది. గంటల తరబడి నిద్రపోవడం కంటే ఒక గంటలోపే నిద్రపోయే వారు ఆరోగ్యంగా ఉంటారని సర్వేలో తేలింది.
అంతేకాకుండా పగలు వివిధ పనులు చేయడం వల్ల మన శరీరం అలసిపోతుంది. తగినంత విశ్రాంతి కోరుకుంటుంది. అందుకే నిద్ర అనేది అత్యంత ఆవశ్యకమని నిపుణులు సుచిస్తున్నారు. రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం, ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు ఎక్కువగా వాడటం, డ్రగ్స్, అధికంగా మద్యం తాగడం వంటి వాటి వల్ల నిద్రలేమి వస్తుంది. అయితే.. చాలా మంది సరైన వేళల్లో నిద్రపోరు. ఇది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికీ రాత్రి పూట 8 గంటల నిద్ర అవసరమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం