Fact Check: కరోనా సెకండ్ దేశంలో మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒకవైపు వ్యాక్సిన్ ప్రక్రియ జరుగుతుండగానే.. మరోవైపు కరోనా విలయతాండవం చేస్తుంది. దీంతో వ్యాక్సిన్ పంపిణి మరింత వేగవంతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే మే1వ తేదీ నుంచి 10 ఏళ్ళు పైబడిన వారికి టీకా అందించనున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా సహా పలు రాష్ట్రాలు ఉచితంగా టీకాను అందించనున్నట్లు ప్రకటించాయి. అయితే వ్యాక్సిన్ పట్ల అనేక సందేహాలు, భయాలు వ్యక్తమవుతుండడంతో చాలా మంది టీకా తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. తాజాగా మహిళల వ్యాక్సినేషన్ కు సంబంధించి మరో రూమర్ హల్ చల్ చేస్తోంది. మహిళలు పీరియడ్స్ (నెలసరి)కు ముందు ఐదు రోజులు, ఆ తర్వాత ఐదు రోజులు కరోనా వ్యాక్సిన్ తీసుకోకూడదంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వార్త ఫేక్ అంటూ ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రముఖ గైనకాలజిస్ట్, పద్మ శ్రీ అవార్డ్ గ్రహీత మంజుల అనగాని ద్వారా ధృవికరించుకున్నానని స్ఫష్టం చేశారు. ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయకండి అంటూ వేడుకున్నారు.
కరోనా వ్యాక్సిన్ రుతుచక్ర మార్పులకు కారణమవుతుంది అనేందుకు సాక్ష్యాలు లేవు. ఎలాంటి భయాలు లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని నిపుణులంటున్నారు. టీకా తీసుకున్నతరువాత తమకెలాంటి సమస్యలు లేవని పలువురు డాక్టర్లతోపాటు, మరి కొంతమంది తమ అనుభవాలను చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత పీరియడ్ సైకిల్‌లో తేడాలున్నాయనడానికి ఎటువంటి ఆధారాలు లేవనీ, అలాగే ఒకసారి పీరియడ్‌లో మార్పు వస్తే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. అటు గర్భవతిగా ఉన్నవారికి సురక్షితమని సీడీసీ పేర్కొంది. ఇక రుతుచక్రాలు, వ్యాక్సీన్లకు సంబంధించిన డేటా లేకపోవడంపై ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జెన్ గుంటర్ అసహనం వ్యక్తం చేశారు. వివిధ రకాల వ్యాక్సిన్లు, వందత్వం లేదా పునరావృత గర్భస్రావాలకు సంబంధిత ప్రభావాల గురించి అధ్యయనాలు ఉన్నాయి కానీ దీనిపై లేవన్నారు. అయితే టీకా తర్వాత వచ్చే జ్వరం గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో పీరియడ్ సమస్యల గురించి కూడా తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమని తెలిపారు. అలాగే కరోనా వ్యాక్సిన పీరియడ్స్ లో సమస్యలకు సంబంధం లేదని మరికొంత మంది పరిశోధకులు తేల్చి చెప్పారు. క్లినికల్ పరీక్షల సందర్భంగా ఇలాంటి సమస్యలేవి తమ దృష్టికి రాలేదని ఆమె చెప్పారు.
టీకా తర్వాత మార్పులను అనుభవించిన ఇద్దరు మహిళా పరిశోధకులు కరోనా వ్యాక్సిన్లు పీరియడ్స్ పై ఎలా ప్రభావితం చేస్తాయని పరిశీలిస్తున్నారు. టీకాతో ఏర్పడే సమస్యల గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పోస్ట్ స్కాలర్ రచయిత కాథరిన్ లీ చికాగో చెప్పారు. ధారణంగా రుతుస్రావం అనేది ఒత్తిడికి సంబంధించినదై ఉంటుంది కాబట్టి. దీనికి ఒత్తిడి కారణం కావచ్చని, శాన్ డియాగోలోని ప్రముఖ స్త్రీవైద్య నిపుణురాలు డాక్టర్ కెల్లీ కల్వెల్ చెప్పారు. వ్యాక్సిన్ తరువాత యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యేందుకు కొంత ఒత్తిడి ఏర్పడుతుందని బహుశా ఇదే సమస్యకు కారణం కావచ్చన్నారు. వ్యాక్సిన్ తరువాత శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన, ఎండోమెట్రియంను, రుతుస్రావం సమయంలో మందంగా ఉండే గర్భాశయం లైనింగ్‌పై ప్రభావంతో ఈ సమస్యలు ఏర్పడి ఉంటాయా అనే సందేహాన్నిఆమె వ్యక్తం చేశారు. ఈ సమస్యలు ఇతర వ్యాక్సిన్లలో కూడా ఉండవచ్చని, అయితే కరోనాకు సంబంధించి ఇప్పటివరకు మాస్ వ్యాక్సినేషన్ జరగలేదు. అందుకే సోషల్ మీడియాలో ఇపుడు స్తున్నంత విరివిగా ప్రశ్నలు రాలేదని దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందన్నారు. 24ఏళ్ళ మహిళ మాత్రం టీకా తీసుకున్న తర్వాత 5 రోజుల ముందుగానే తనకు పీరియడ్ వచ్చిందని.. బ్లీడింగ్ కూడా ఎక్కువగా ఉందని ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా.. ఎనిమిది సంవత్సరాల క్రితమే మెనోపాజ్ వచ్చిన తనకు వ్యాక్సిన్ తీసుకున్న మూడు వారాల తర్వాత మళ్లీ బ్లీడింగ్ అవుతుందని మరో మహిళ తెలిపింది. మరో మహిళకు వెన్నునొప్పి, అలాగే పురిటి నొప్పుల లాంటి ఫీలింగ్ కలిగిందని తెలిపింది.
ట్వీట్..
Please STOP sharing that the Covid Vaccine affects your period / cannot be taken during your period.
NOT TRUE!!#Verified with a Padmasri Award Winning Gynaecologist Dr Manjula Anagani— Chinmayi Sripaada (@Chinmayi) April 23, 2021
Has anyone noticed the vaccine doing funky things with their menstrual cycle? I was oddly spotting last week (got second dose a week ago) and now it’s fully late. ?
— Nneka M. Okona ?? (@afrosypaella) April 14, 2021
I got both my doses when I had my periods. I got covid later on because I work in a hospital but recovered without side effects within a week all thanks to he vaccine. PLEASE GET VACCINATED, there will be very mild side effects BUT IT WILL SAVE YOUR LIFE. https://t.co/XqZCM0Ob0k
— Wear your mask (@vakeel_saheba) April 24, 2021
Also Read: ఐడియా ఇవ్వు.. రూ.5 లక్షలు పట్టు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ.. ఎప్పటివరకు ఛాన్స్ అంటే..