శరీరానికి విటమిన్ల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం విటమిన్లు శరీరంలో ప్రధానమైనవిగా చెబుతారు వీటి వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందడం సాధ్యమవుతుంది. అయితే ఈ విటమిన్లు మంచి ఆహారం, న్యాచురల్‌గా ప్రకృతి నుండి శరీరానికి అందుతాయి. విటమినులు శరీరానికి సరిగ్గా అందకపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తూంటాయి. దీనికోసం వైద్యులు
మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లను వాడమని సూచిస్తుంటారు.
అయితే ఈ మధ్య కాలంలో సరైన, సమయానికి ఆహారం శరీరానికి అందకపోవడంతో చాలా మంది మల్టీవిటమిన్ల వాడకాన్ని పెంచారు. అయితే అధికంగా మల్టీవిటమిన్లు వాడితే ఆరోగ్య సమస్యలు తగ్గడం కంటే కూడా త్వరగా మరణం సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని తాజా సర్వే రిపోర్ట్లు చెబుతున్నాయి. అమెరికాకు సంబంధించిన నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు 1990 నుంచి 3 లక్షల మందిపై దాదాపు 20 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. ఎక్కువకాలం జీవించడానికి మల్టీ విటమిన్ల ఉపయోగం ఉండదని.. మరణించే ముప్పు ఏ మాత్రం తగ్గించడం లేదని పరిశోధకులు గుర్తించారు. పైగా మల్టీ విటమిన్లు తీసుకోని వారి కంటే.. మల్టీ విటమిన్ టాబ్లెట్లు వాడుతున్న వారిలో త్వరగా మరణించే ప్రమాదం నాలుగు శాతం ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.
అందుకోసం మల్టీ విటమిన్ తీసుకోవడం కంటే.. హెల్తీ ఆహారం తీసుకోవడం మంచిదని పరిశోధకులు చెప్తున్నారు. తీసుకునే ఆహారంలో సూక్ష్మ, అతి సూక్ష్మ పోషకాలు, పీచు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలంటున్నారు. కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువ ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. మల్టీ విటమిన్ తీసుకోవడం కంటే ఆహారంలో ఎక్కువగా కూరగాయలు, చిరుధాన్యాలు తీసుకోవడం మంచిదని చాలామంది వైద్యులు సలహాలు ఇస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..