వంటింటిలో ఉన్న గొప్ప ఔషధాలలో అల్లం కూడా ఒకటి. దీన్ని అనేక కూరల్లో వేసుకుంటుంటారు. కూరల్లోనే కాదు నాన్ వెజ్ వంటకాల్లోనూ అల్లంను వాడుతుంటారు. అనేక ముఖ్యమైన పోషకాలు కలిగిన అల్లం ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందని డాక్టర్లు చెబుతుంటారు. కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు బి3, బి6, ఐరన్, పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియంతో పాటు ఇతర పోషకాలు అల్లంలో పుష్కలంగా ఉన్నాయి. చిన్న ముక్క అల్లం కూరల్లో రుచిని ఎలాగైతే ఇస్తుందో.. ఆరోగ్యం విషయంలోనూ అల్లం తీసుకోకపోతే అంత చేటుగా ఉంటుందని డాక్టర్ల మాట. అయితే అధిక శాతంలో అల్లం తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయని వారు సూచిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు అల్లం అస్సలు తినకూడదని అంటున్నారు.
రోజుకు 5 నుంచి 6 గ్రాముల అల్లం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనని.. అంతకంటే ఎక్కువ తీసుకుంటే అది మనకు హాని కలిగించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు వస్తాయని చెబుతున్నారు. మరోవైపు ఎక్కువ సార్లు అల్లం టీ తాగడం వల్ల ఛాతీ, కడుపులో మంట కలుగుతుందట. అలాగే మీకు రాత్రి నిద్రపోయే ముందు క్రమం తప్పకుండా అల్లం టీ తాగే అలవాటు ఉంటే, వెంటనే మానుకోండి.! రాత్రిపూట అల్లం టీ తాగడం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. ఇక సరిగ్గా నిద్రపోకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటారు. డయాబెటిక్ పేషెంట్స్ అల్లం టీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని డాక్టర్స్ అంటున్నారు. అల్లం టీ ఎక్కువ టీ తాగితే, అసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని చెబుతున్నారు.
Also Read:
13 పరుగులకే ఆలౌట్.. నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్.. ఆరు వికెట్లతో రఫ్ఫాడించిన ఆ బౌలర్ ఎవరంటే!
పండ్ల వ్యాపారి మోసం.. కస్టమర్లను ఎలా బురిడీ కొట్టిస్తున్నాడో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!