Weight Loss: యాలకులతో బరువు ఈజీగా తగ్గొచ్చు.. ఇంకా ఆ సమస్యలన్నీ హాంఫట్..

|

Jul 17, 2022 | 12:32 PM

ప్రతిఒక్కరూ రోజూ జిమ్‌కి వెళ్లడం, కఠినమైన డైట్ చార్ట్‌ని అనుసరించడం సాధ్యం కాదు. అలాంటి పరిస్థితిలో వారు పెరుగుతున్న బరువును తగ్గించుకోవడం పెద్ద సమస్యగా మారింది.

Weight Loss: యాలకులతో బరువు ఈజీగా తగ్గొచ్చు.. ఇంకా ఆ సమస్యలన్నీ హాంఫట్..
Weight Loss Tips
Follow us on

Weight Loss Tips: కరోనా వైరస్ మహమ్మారి, లాక్‌డౌన్, జీవనశైలి కారణంగా చాలా మంది ప్రజలు స్థూలకాయంతో బాధపడున్నారు. ముఖ్యంగా శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. అధిక బరువును నియంత్రించాలంటే.. జిమ్‌కి వెళ్లడం, డైట్లను అనుసరించడం లాంటివి చేయాలి. అయితే.. ప్రతిఒక్కరూ రోజూ జిమ్‌కి వెళ్లడం, కఠినమైన డైట్ చార్ట్‌ని అనుసరించడం సాధ్యం కాదు. అలాంటి పరిస్థితిలో వారు పెరుగుతున్న బరువును తగ్గించుకోవడం పెద్ద సమస్యగా మారింది. అయితే.. కిచెన్‌లో ఉన్న సుగంధ ద్రవ్యాల సహాయంతో పొట్ట, బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

యాలకులతో బెల్లీ ఫ్యాట్ దూరం..

స్థూలకాయం అనేది ఒక వ్యాధి కానప్పటికీ.. దీని కారణంగా అనేక వ్యాధులు వస్తాయి. బిజీ లైఫ్‌స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు దీనికి కారణం. ఈ సమస్యను అధిగమించడానికి యాలకులను తీసుకోవచ్చు. ఇవి దివ్యఔషధంగా పేర్కొంటున్నారు నిపుణులు. యాలకులు జలుబు, దగ్గు, నోటి దుర్వాసనను దూరం చేయడంలో సహాయపడతాయి. అయితే యాలకులు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఏలకులు బరువు తగ్గేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. యాలకుల్లో కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయి. రోజూ ఆహారంలో చేర్చుకుంటే పొట్ట, నడుము చుట్టూ ఉన్న కొవ్వు సహజంగా కరిగిపోతుంది. ఈ సుగంధద్రవ్యాలను సాధారణంగా కూరలు, పరాటాలు, స్వీట్లలో ఉపయోగిస్తారు. కొంతమంది ఏలకులను పాలు, టీలో కలుపుతారు. ఇంకా మసాలా టీలో కూడా ఉపయోగిస్తారు.

కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది..

ఏలకులు తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. దీని వల్ల కడుపు సమస్యలు కూడా దూరమవుతాయి. అసిడిటీ, మలబద్ధకం, కడుపులో మంట, గ్యాస్ వంటివి తగ్గుతాయి. జీర్ణశక్తి పెరగడం వల్ల, కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది. దీంతో క్రమంగా బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు చిన్న ఏలకులను పచ్చిగా తింటే.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..