టైప్ 2 డయాబెటీస్‌ బాధపడేవారు ఇలా చేయండి.. ఎందుకంటే..?

| Edited By:

Oct 17, 2019 | 8:58 PM

డయాబెటీస్‌తో బాధపడే వారు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలుు తీసుకోవాల్సి ఉంటుంది. కంటిని నచ్చిందని తినే వీలుండదు. నోటికి రుచిగా ఉంది కదా అని తినే అవకాశం ఉండదు. ముఖ్యంగా డయాబెటీస్తో ఉన్న వారు ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించాలని వైద్యులు సూచిస్తారు. అయితే డయాబెటీస్ వ్యాధిలో రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో ప్రమాదకరమైంది టైప్ 2 డయాబెటీస్. దీంతోనే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. దీనితో బాధపడేవారు ఆహార నియామాలను తూ.చ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. […]

టైప్ 2 డయాబెటీస్‌ బాధపడేవారు ఇలా చేయండి.. ఎందుకంటే..?
Follow us on

డయాబెటీస్‌తో బాధపడే వారు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలుు తీసుకోవాల్సి ఉంటుంది. కంటిని నచ్చిందని తినే వీలుండదు. నోటికి రుచిగా ఉంది కదా అని తినే అవకాశం ఉండదు. ముఖ్యంగా డయాబెటీస్తో ఉన్న వారు ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించాలని వైద్యులు సూచిస్తారు.

అయితే డయాబెటీస్ వ్యాధిలో రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో ప్రమాదకరమైంది టైప్ 2 డయాబెటీస్. దీంతోనే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. దీనితో బాధపడేవారు ఆహార నియామాలను తూ.చ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలనే విషయాన్ని కూడా తెలుసుకుని ఉండాలి.
టైప్ 2 డయాబెటీస్‌తో ఇబ్బందిపడేవారు రోజుకు ఒక గుడ్డు తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతిరోజు ఉదయం ఆహారంగా గుడ్డును తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే అధిక మొత్తంలో కొవ్వు, తగినన్ని క్యాలరీలు గుడ్డులో ఉంటాయి. దీన్ని ఉదయాహారంగా తీసుకోవడం వల్ల ఆ రోజంతా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.