AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్కటి చాలు.. ప్రతిరోజూ కోడిగుడ్డు తినడం వల్ల ఎన్ని లాభాలో మీకు తెలుసా..?

రోజుకో గుడ్డు తింటే శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. కండరాల బలం, ఎముకలు, మెదడు, కంటి ఆరోగ్యం, రోగనిరోధక శక్తికి గుడ్డు ఉపయోగపడుతుంది. అయితే కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారు గుడ్డు తీసుకునే విషయంలో వైద్యులు లేదా డైటీషియన్‌ సలహా తీసుకోవడం మంచిది.

ఒక్కటి చాలు.. ప్రతిరోజూ కోడిగుడ్డు తినడం వల్ల ఎన్ని లాభాలో మీకు తెలుసా..?
Egg Benefits
Shaik Madar Saheb
|

Updated on: Aug 13, 2026 | 7:44 PM

Share

కోడిగుడ్డులో ఎన్నో పోషక పదార్థాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అత్యవసరమైనవి.. అందుకే.. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అంతా రోజుకు ఒక గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ఒక గుడ్డు తినడం వల్ల సగటున 70 నుండి 80 క్యాలరీలు, ఆరు గ్రాముల ప్రోటీన్లు, ఐదు గ్రాముల కొవ్వులు, 190 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ శరీరానికి లభిస్తాయి. గుడ్డులో లవణాలతో పాటు ఫాస్ఫరస్, అయోడిన్, ( విటమిన్ ఎ, బి12, డి,) సెలీనియం, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. అంతేకాకుండా, పొటాషియం, కాల్షియం వంటివి గుడ్డులో పుష్కలంగా లభిస్తాయి.

ఇవి ఎముకలు గట్టిపడటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే, నరాల బలహీనతతో బాధపడేవారు రోజు గుడ్డును తీసుకోవడం వల్ల నరాల బలహీనత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో గుడ్డు తినడం వల్ల కండరాల బలానికి, మెదడు చురుకుదనానికి, కంటి ఆరోగ్యానికి సహాయపడుతుందని పేర్కొంటున్నారు. ఇంకా ఆరోగ్య నిపుణుల సలహా ప్రకారం.. రోజుకో గుడ్డు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.

అయితే.. గుడ్డును ఇష్టపడని వారు అరుదు. దీనిని ఎగ్ ఫ్రైగా, ఉడకబెట్టి, ఆమ్లెట్‌గా వివిధ రూపాల్లో ఆహారంగా తీసుకుంటారు. గుడ్డుతో క్షణాల్లో కూరను తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కూడా చాలా సులువుగా ఉంటుంది. ఇంకా పచ్చసొనను కూడా తినవచ్చని.. దీనివల్ల ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే, ఇటీవలి కాలంలో గుడ్డును ఆహారంగా తీసుకోవడంపై అనేక సందేహాలు, అపోహలు నెలకొన్నాయి.. అయితే.. అలాంటివి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని.. గుడ్డును కచ్చితంగా తినాలని డైటీషియన్లు చెబుతున్నారు. అయితే.. కోడిగుడ్లలో కొవ్వు ఉంటుందని.. అతిగా తీసుకుంటే చేటు తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు. కావున కోడిగుడ్డు తినే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని పేర్కొంటున్నారు.

అయితే.. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు.. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ లేదా రక్తపోటు ఉన్నవారు రోజుకు గుడ్డు తినే ముందు డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us