
ప్లాస్టిక్ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందనేది కాదనలేని సత్యం. అయినప్పటికీ మనం నిత్య జీవితంలో దాని వాడకాన్ని తగ్గించలేకపోతున్నాం. మనం ఆహార వినియోగం, నిల్వ నుంచి ప్రతి దశలో ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నాం. అంతేకాదు మనం ప్లాస్టిక్ వాడిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నాం కూడా. అయితే మన చుట్టూ ఉన్న జంతువులు తెలియకుండానే ఈ కవర్లను తిని ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇందులో ఆవుల సంఖ్య అత్యధికం. ఇది ఇప్పటి సమస్య కాదు.. ఈ సమస్య చాలా సంవత్సరాలుగా ఆవుల పాలిట శాపంగా మారింది. ఆవులు ప్లాస్టిక్ తినడం మంచిది కాదని అందరికీ తెలుసు. కానీ వాటిని ఎలా నిరోధించాలో? ఆవులకు ఎలాంటి ప్రమాదాన్ని కలిగిస్తుందో? చాలా మందికి అవగాహన లేకపోవడం దురదృష్టకరం. ఆవులు ప్లాస్టిక్ తింటే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
నేటికీ ప్లాస్టిక్ అనేక పశువుల మరణాలకు కారణమవుతోంది. మేత మేసే సమయంలో ఆవులు రోడ్లపై పడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తినే ధోరణి పెరుగుతోంది. ప్లాస్టిక్ తినడం వల్ల చనిపోయిన జంతువుల కళేబరాలను కాకులు, గద్దలు కూడా ముట్టుకోవు. అంతేకాకుండా ఆవులను ప్లాస్టిక్ తినవద్దని మనం చెప్పలేం. వాటికి మానవ భాష అర్ధంకాదు. అయితే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా మనం ఈ సమస్యను నివారించవచ్చు. మనం వీలైనంత వరకు ప్లాస్టిక్‌లోని ఆహారాన్ని తినాలి. జంతువులకు ఆహారంగా వాటిని పారవేయడం మానేయాలి. అప్పుడే ఇలాంటి సమస్యలు తీవ్రతరం కాకుండా నిరోధించవచ్చు.
కడుపులో ప్లాస్టిక్‌లు జీర్ణం కావు. దీనివల్ల పశువులు చనిపోతాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు తినడం వల్ల చనిపోయే జంతువులలో, ఆవుల సంఖ్య మరింత ఎక్కువ. ఆవుల దవడల నిర్మాణం వాటికి ఏమి తింటున్నాయో తెలియదని విధంగా ఉంటుంది. అవి ఆహారాన్ని నమిలినప్పటికీ, వాటి పెదవులు వ్యర్థాలను గుర్తించేంత సున్నితంగా ఉండవు. దీని కారణంగా ఆవులు ప్లాస్టిక్‌ను తింటున్న విషయాన్ని అవి గ్రహించలేవు. పైగా వాటికి వాంతులు చేసుకోవడం రాదు. దీంతో ఆవుల కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి ఇతర ఆహారాన్ని తినడానికి వీలు లేకుండా ఉంటుంది. ప్లాస్టిక్ మాత్రమే కాదు చనిపోయిన ఆవుల కడుపులో పదునైన ఇనుప ముక్కలు, మేకులు కూడా కనిపిస్తాయి. ఇటువంటి లోహ వ్యర్థాలు ఆవుల కడుపు, ప్రేగులలోకి ప్రవేశించి వాటి ప్రాణాలను హరిస్తున్నాయి.
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.