ప్రస్తుత కాలంలో ఫూల్ మఖానాలు ఎంతో ఫేమస్ అయ్యాయి. వీటినే తామర గింజలు లేదా ఫాక్స్ నట్స్ అని కూడా పిలుస్తున్నారు. వీటిని కూడా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్‌లో ఓ భాగంగా తీసుకుంటున్నారు. అంతే కాకుండా వీటితో కూరలు, స్నాక్స్ తయారు చేస్తున్నారు. మఖానా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచింది. ఇందులో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు లభ్యమవుతాయి. కొద్దిగా వేయించుకుని తింటే చాలు.. ఎంతో రుచిగా ఉంటాయి. ప్రతి రోజూ వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ ఓ గుప్పెడు మఖానా తింటే ఆరోగ్యంగా ఉండొచ్చని అంటున్నారు. మరి వీటితో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫూల్ మఖానాలో గల్లిక్ యాసిడ్ , సపోనిన్లు, ఆల్కలాయిడ్స్ ఉంటాయి. వీటిల్లో ఉంటే ఉండే మెగ్నీషియం రక్త సరఫరాను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు త్వరగా ఎటాక్ చేసే అవకాశం తగ్గుతుంది.
మఖానా తినడం వల్ల మూత్ర పిండాల ఆరోగ్యం కూడా పెరుగుతుంది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి కిడ్నీల్లోని మలినాలను బయటకు పంపిస్తాయి. అలాగే వీటిపై ఒత్తిడిని తగ్గిస్తాయి. వాపు లక్షణాలు రాకుండా చూస్తాయి.
మఖానాలో థయామిన్ మెండుగా ఉంటుంది. ఇవి మెదడు పని తీరును మెరుగు పరుస్తాయి. దీంతో మెదడు ఆరోగ్యంగా పని చేస్తుంది. అలాగే వీటిల్లో ఉండే కొన్ని సమ్మేళనాలు. నరాల సరైన విధంగా పనిచేసేలా హెల్ప్ చేస్తాయి.
ప్రతి రోజూ ఓ గుప్పెడు ఫూల్ మఖానా తినడం వల్ల సంతాన లేమి సమస్యలు తగ్గుతాయి. వీటితో వీర్యం నాణ్యత అనేది పెరుగుతుంది. కాబట్టి సంతానం లేని వాళ్లు వీటిని తినవచ్చు.
మఖానా తినడం వల్ల చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. చర్మ ఆరోగ్యం అనేది పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. చర్మంపై ఉండే ముడతలను తగ్గిస్తాయి. మఖానా యాంటీ ఏజింగ్ ఏజెంట్‌లా పని చేస్తాయి. కాబట్టి మీ వయసు పెరుగుతున్నా యవ్వనంగా ఉంటారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..