Boiled Groundnuts: ఉడకబెట్టిన వేరుశనగ తింటే.. ఈ సమస్యలన్నింటికీ బైబై చెప్పొచ్చు..

వేరు శనగ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ వీటి గురించి తెలుసు. జీడిపప్పులో ఎలాంటి పోషకాలు లభిస్తాయో.. వేరు శనగలో కూడా అలాంటి పోషకాలే లభిస్తాయి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. పలు రకాల వంటకాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పల్లీలు ఉపయోగించడం వల్ల వంటకాల రుచి కూడా పెరుగుతుంది. వేరు శనగ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చాలా మంది స్నాక్స్‌గా వీటిని..

Boiled Groundnuts: ఉడకబెట్టిన వేరుశనగ తింటే.. ఈ సమస్యలన్నింటికీ బైబై చెప్పొచ్చు..
boiled peanuts
Follow us

|

Updated on: May 01, 2024 | 1:35 PM

వేరు శనగ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ వీటి గురించి తెలుసు. జీడిపప్పులో ఎలాంటి పోషకాలు లభిస్తాయో.. వేరు శనగలో కూడా అలాంటి పోషకాలే లభిస్తాయి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. పలు రకాల వంటకాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పల్లీలు ఉపయోగించడం వల్ల వంటకాల రుచి కూడా పెరుగుతుంది. వేరు శనగ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చాలా మంది స్నాక్స్‌గా వీటిని తీసుకుంటూ ఉంటారు. కొంత మంది వేయించుకుని తింటే.. మరొకరు ఇతర పదార్థాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వేరుశనగను ఉడకబెట్టి తినడం వల్ల ఆరోగ్యానికి మరింత మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

యాంటీ ఆక్సిడెంట్లు మెండు:

ఉడకబెట్టిన వేరు శనగలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల చర్మానికి, జుట్టుకు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను కూడా తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటే ఆహారాలు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

మెదడు ఆరోగ్యం:

వేరు శనగ తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగు పడుతుంది. బ్రెయిన్‌ హెల్త్‌కు చాలా మంచిది. ఉడకబెట్టిన పల్లీలు తింటే.. మెదడు పనితీరు మెరుగు పడి.. యాక్టీవ్ అవుతుంది. అంతే కాకుండా మతిమరుపు సమస్యను తగ్గించి.. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. పిల్లలకు ఇస్తే వారి బ్రెయిన్ ఎదుగుదలకు చక్కగా సహాయ పడుతుంది.

ఇవి కూడా చదవండి

బరువు నియంత్రణ:

ఉడకబెట్టిన పల్లీలు తినడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే వీటిల్లో కేలరీలు తక్కువగా, ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా లభిస్తాయి. కొద్దిగా తీసుకున్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఇతర ఆహారాలు తీసుకోలేరు. కాబట్టి.. వెయిట్ లాస్ అయ్యేందుకు ఇది బెస్ట్ ఫుడ్.

బ్లడ్ షుగర్ కంట్రోల్:

ఉడక బెట్టిన పల్లీలు తినడం వల్ల బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇవి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే ప్రోటీన్, ఫైబర్ మెండుగా, తక్కువ క్యాలరీలు లభిస్తాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ఉడకబెట్టిన పల్లీలు తినడం బెటర్.

NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
సొంతిల్లు కావాలా.. జస్ట్ ఈ టిప్స్ పాటించండి చాలు..
సొంతిల్లు కావాలా.. జస్ట్ ఈ టిప్స్ పాటించండి చాలు..
టార్గెట్ '29'.. ఐపీఎల్ చరిత్రలోనే కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
టార్గెట్ '29'.. ఐపీఎల్ చరిత్రలోనే కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
ఏపీ పాలిసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల
ఏపీ పాలిసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల
టాప్ ఫిట్‌నెస్ ఫీచర్లతో కొత్త స్మార్ట్ వాచ్.. స్టైలిష్ డిజైన్..
టాప్ ఫిట్‌నెస్ ఫీచర్లతో కొత్త స్మార్ట్ వాచ్.. స్టైలిష్ డిజైన్..
Horoscope Today: వారికి అదనపు రాబడి బాగా పెరుగుతుంది..
Horoscope Today: వారికి అదనపు రాబడి బాగా పెరుగుతుంది..
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్