Weight Loss: ఖాళీ కడుపుతో ఈ ఆకులు రోజూ 2 తిన్నారంటే.. నెల రోజుల్లోనే సన్నజాజి తీగలా మెరిసిపోతారు!

కూరల తాలింపులో రెండు రెబ్బలు కరివేపాకు వేశామంటే ఆ వాసన వహ్వా అనిపించేస్తుంది. రుచికి, సువాసనకే కాదు ఇది ఆరోగ్యపరంగానూ సాటి లేని మేటి అని రుజువు చేసుకుంటుంది. ఎన్నో రోగాలకు కరివేపాకు ఛూమంత్రం వేస్తుంది. కరివేపాకు జీర్ణక్రియకు మాత్రమే ఉపయోగపడుతుందనే ఆలోచన చాలా మందికి ఉంటుంది..

Weight Loss: ఖాళీ కడుపుతో ఈ ఆకులు రోజూ 2 తిన్నారంటే.. నెల రోజుల్లోనే సన్నజాజి తీగలా మెరిసిపోతారు!
Curry Leaves For Weight Loss

Updated on: Jul 18, 2025 | 12:50 PM

కూర, చారు, పచ్చడి.. వటకం ఏదైనా కావచ్చు. తాలింపులో రెండు రెబ్బలు కరివేపాకు వేశామంటే ఆ వాసన వహ్వా అనిపించేస్తుంది. రుచికి, సువాసనకే కాదు ఇది ఆరోగ్యపరంగానూ సాటి లేని మేటి అని రుజువు చేసుకుంటుంది. ఎన్నో రోగాలకు కరివేపాకు ఛూమంత్రం వేస్తుంది. కరివేపాకు జీర్ణక్రియకు మాత్రమే ఉపయోగపడుతుందనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ ఇది కరివేపాకు అల్సర్లు, ట్యూమర్లను నివారిస్తుంది. ఇది అనేక వ్యాధులకు దివ్య ఔషధం. వంటలో కరివేపాకును ఉపయోగించడం వల్ల ఆహారం, శరీరం నుండి విషాన్ని తొలగించడం సాధ్యమవుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో రెండు కరివేపాకు రెబ్బలను పచ్చిగా తినడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ అలవాటు బరువు తగ్గడానికి భలేగా సహాయపడుతుంది. కాబట్టి కరివేపాకు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ చూద్దాం..

బరువు తగ్గడానికి కరివేపాకు ఎలా సహాయపడుతుంది?

కరివేపాకులలో కార్బజోల్, ఆల్కలీన్ లక్షణాలు ఉంటాయి. ఇవి త్వరగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో 5 నుండి 7 ఆకులను నమిలితే, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు త్వరగా తగ్గుతుంది. ఇది శరీరం నుంచి అదనపు కొవ్వును తగ్గించడమే కాకుండా శరీరం నుంచి మలినాలను కూడా తొలగిస్తుంది. కరివేపాకు టీ తయారు చేసుకుని తాగడవ ద్వారా కూడా బరువును తగ్గించుకోవచ్చు. టీ రుచి పెంచడానికి నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె జోడించవచ్చు. ఇలా చేస్తే కేవలం ఒక నెలలోనే మీ బరువులో తేడాను చూస్తారు. కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్లు, ఆల్కలాయిడ్లు మీ జీవక్రియను పెంచుతాయి.

కరివేపాకు ప్రయోజనాలు

కరివేపాకు తినడం వల్ల బరువు తగ్గడమే కాకుండా జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, ఫైబర్, భాస్వరం, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి మీరు త్వరగా బరువు తగ్గుతారు. ఈ ఆకు రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఈ ఆకులు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది మీ జ్ఞాపకశక్తిని పదునుపెడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.