Bananas: అరటిపండ్లు ఎక్కువ రోజులు పాడవ్వకుండా ఉండే టిప్ మీకోసం

|

Feb 15, 2024 | 11:13 AM

మంచి ఆరోగ్యకర జీవనం గడపడానికి అరటి పండ్లు చక్కగా ఉపయోగపడతాయి. ఇతర పండ్లతో పోలిస్తే అరటిపండు తక్కువ ధరకే లభిస్తుంది. ఇది ఏడాది పొడవునా లభించే పండు. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే అరటి పండ్లు త్వరగా కుళ్లిపోతాయి. కాగా అరటి పండ్లు నల్లగా మారకుండా ఎలా నిల్వ చేయాలో తెలిపే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Bananas: అరటిపండ్లు ఎక్కువ రోజులు పాడవ్వకుండా ఉండే టిప్ మీకోసం
Bananas
Follow us on

అరటిపండును పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. రాత్రి భోజనం తర్వాత  లేదా పెరగన్నంలో ఒక అరటి పండు తింటే శరీరానికి చాలా మేలు చేకూరుతుంది అని నిపుణులు చెబుతుంటారు. ఇతర పండ్ల మాదిరిగానే అరటిలో విత్తనాలు ఉండవు కాబట్టి అందరూ దీన్ని ఇష్టపడతారు. పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-A, B, C,  విటమిన్ B6 వంటి ఎన్నో పోషకాలు అరటిలో ఉన్నాయి. అరటి పండు తిన్న వింటనే శరీరానికి ఎనర్జీ ఇస్తుంది. అందుకే క్రికెటర్స్ గేమ్ ఆడేటప్పుడు మధ్యలో అరటిపండు తింటూ ఉంటారు.  కానీ మార్కెట్‌ నుంచి తెచ్చిన అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. రెండు రోజుల్లోనే డ్యామేజ్ అవుతాయి.  అరటిపండ్లు కుళ్లిపోకుండా ఎలా చూసుకోవాలో తెలిపే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అరటిపండును ఎక్కువ రోజులు ఉంచితే కాండం భాగం ముందుగా కుళ్లిపోయి కాయ నల్లగా మారుతుంది. ఈ అనుభవం అందరికీ ఉంటుంది. అరటిపండు కాండంను కాగితం లేదా ప్లాస్టిక్‌లో చుట్టడం వల్ల అరటిపండు త్వరగా చెడిపోకుండా ఉంటుంది. ఈ పద్ధతి ఈ వీడియోలో చూపబడింది. ఇందులో అరటిపండు చెడిపోకుండా అరటి కాయల కాండాన్ని ప్లాస్టిక్‌తో చుట్టి ఉంచారు.

 

ఈ వీడియో మస్సిమో అనే ఖాతాలో షేర్ చేయబడింది. వీడియో ప్రారంభంలో ఒక ముదర పండిన అరటిపండ్లను చూడవచ్చు. ఆ తర్వాత, తాజా అరటిపండ్లను తీసుకుని, వాటి కాండాన్ని ప్లాస్టిక్‌తో చుట్టారు. అప్పుడు పండ్లు పాడవకుండా ఉన్నాయి.  అరటి పండు పండినప్పుడు, దాని కాండం ఇథిలీన్ వాయువును విడుదల చేస్తుంది. ఇది మిగిలిన పండ్లకు వ్యాపిస్తుంది, దీని వలన పండ్లు త్వరగా పాడయిపోతాయి. అందుకే కాండం చుట్టూ ప్లాస్టిక్  చుట్టడం వల్ల ఇథిలీన్ వాయువు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అలా అరటిపండ్లు ఎక్కువకాలం నిల్వ ఉంచవచ్చు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. చాలా మంచి టిప్ చెప్పారని సదరు ట్విట్టర్ యూజర్‌ను ప్రశంసిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..