Boiled Eggs: ఉడికించిన గుడ్ల తొక్క సరిగ్గా రావడం లేదా? ఈ ట్రిక్స్‌తో సులభం

Boiled Eggs: కొన్నిసార్లు ఉడికించిన గుడ్డు పెంకు చర్మానికి అంటుకుంటుంది. కొన్నిసార్లు అది ఊడిపోకుండా గుడ్డు కట్‌ అవుతుంటుంది. గుడ్లు తొక్కడం చాలా కష్టం అనుకుంటారు. కొన్ని చిట్కాలను పాటిస్తే గుడ్డు పొట్టు తీయడం చాలా సులభం అవుతుంది. సరైన పద్ధతిని అనుసరించడం..

Boiled Eggs: ఉడికించిన గుడ్ల తొక్క సరిగ్గా రావడం లేదా? ఈ ట్రిక్స్‌తో సులభం

Updated on: Sep 19, 2025 | 10:50 AM

Boiled Eggs: గుడ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అవి శరీర ప్రోటీన్ అవసరాలను తీర్చడమే కాకుండా అనేక ఇతర పోషకాలను కూడా అందిస్తాయి. మీ ఆహారంలో గుడ్లను చేర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ, వాటిని ఉడకబెట్టడం వాటిని తినడానికి సులభమైన మార్గం. గుడ్లు ఉడకబెట్టడం వాటిని తినడానికి సులభమైన మార్గం అయితే వాటిని తొక్కడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు ఉడికించిన గుడ్డు పెంకు చర్మానికి అంటుకుంటుంది. కొన్నిసార్లు అది ఊడిపోకుండా గుడ్డు కట్‌ అవుతుంటుంది. గుడ్లు తొక్కడం చాలా కష్టం అనుకుంటారు. కొన్ని చిట్కాలను పాటిస్తే గుడ్డు పొట్టు తీయడం చాలా సులభం అవుతుంది. సరైన పద్ధతిని అనుసరించడం ద్వారా మీరు ప్రతిసారీ త్వరగా, శుభ్రంగా గుడ్లు తొక్కలను తీయవచ్చు. మరి ఉడికించిన గుడ్ల తొక్కలు సులభంగా రావాలంటే ఈ చిట్కాలను పాటించండి.

1. మరిగేటప్పుడు ఉప్, వెనిగర్ జోడించండి: గుడ్లు ఉడకబెట్టడానికి మరిగే నీటిలో చిటికెడు ఉప్పు, ఒక టీస్పూన్ వెనిగర్ జోడించండి. ఇది గుడ్డు పెంకులు విడిపోవడానికి, సులభంగా తొక్కడానికి సహాయపడుతుంది.

2. గుడ్లను చల్లటి నీటిలో వేయండి: ఉడికిన వెంటనే గుడ్లను కనీసం 10 నిమిషాలు చల్లని లేదా మంచు నీటిలో ఉంచండి. ఈ ఆకస్మిక చల్లదనం వల్ల షెల్ వదులుతుంది. తొక్క తీయడం సులభం అవుతుంది.

ఇవి కూడా చదవండి

3. మెల్లగా పగులగొట్టి తొక్క తీయండి: గుడ్డు ఉడికిన తర్వాత దానిని ప్లేట్ లేదా కౌంటర్‌పై తేలికగా కొట్టండి. తద్వారా పెంకులో చిన్న పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగుళ్ల వెంట మెల్లగా తొక్క తీయండి.

4. ప్రవహించే నీటిలో గుడ్లు తొక్క తీయడం: ప్రవహించే నీటిలో గుడ్లు తొక్క తీయడం వల్ల చిన్న షెల్ ముక్కలను సులభంగా తొలగించి, అవి మీ వేళ్లకు అంటుకోకుండా నిరోధించవచ్చు. మీ ఇంట్లో ట్యాప్‌ వాటర్‌ను ఆన్‌ చేసి తీయడం దాని గుడ్డును ఉంచి తొక్క తీయడం సులభం అవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి