చికెన్, మటన్ త్వరగా ఉడికించాలంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి.. పని ఈజీ, సూపర్‌ టేస్ట్..!

చికెన్ వండిన అంత ఈజీగా మటన్‌ వండలేమని చెబుతుంటారు. ఎందుకంటే.. చికెన్‌ త్వరగా ఉడికిపోతుంది. కానీ, మటన్‌ అలా కాదు..ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ, కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే... చాలా తక్కువ సమయంలోనే మటన్ మెత్తగా ఉడకడమే కాకుండా.... రుచి కూడా రెట్టింపు అవుతుందని మీకు తెలుసా..? అదేలాగో ఇక్కడ చూద్దాం...

చికెన్, మటన్ త్వరగా ఉడికించాలంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి.. పని ఈజీ, సూపర్‌ టేస్ట్..!
కానీ ప్రపంచంలోనే అత్యధికంగా చికెన్ తినే దేశం చైనా అని తాజా సర్వేలో తేలింది. 2022 వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా చికెన్ తినే దేశాలలో చైనా అగ్రస్థానంలో నిలిచింది.

Updated on: Jan 05, 2026 | 2:32 PM

భోజన ప్రియులకు నాన్‌వెజ్‌ అంటే చాలా ఇష్టం..! సండే నా మండే.. అనట్టుగా చికెన్‌, మటన్‌, చేపలు వంటివి ఇష్టంగా లాగించేస్తుంటారు. కొందరికైతే.. నాన్‌వెజ్‌ పేరు చెప్పగానే నోరూరిపోతుంటారు. ఇంకొందరు చికెన్ కంటే మటన్ తినడం ఇష్టపడుతుంటారు. కానీ… చికెన్ వండిన అంత ఈజీగా మటన్‌ వండలేమని చెబుతుంటారు. ఎందుకంటే.. చికెన్‌ త్వరగా ఉడికిపోతుంది. కానీ, మటన్‌ అలా కాదు..ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ, కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే… చాలా తక్కువ సమయంలోనే మటన్ మెత్తగా ఉడకడమే కాకుండా…. రుచి కూడా రెట్టింపు అవుతుందని మీకు తెలుసా..? అదేలాగో ఇక్కడ చూద్దాం…

చికెన్‌, మటన్‌ ఏదైనా సరే… నాన్‌వెజ్‌ ఆహారం వండేప్పుడు కొన్ని చిట్కాలు పాటించటం వల్ల అది ఈజీగా ఉడికిపోతుంది. రుచి కూడా అమోఘంగా ఉంటుంది. ఇందుకోసం ముందుగా ముఖ్యమైన విషయం ఏంటంటే.. మాంసం ముక్కకల పరిమాణం సమంగా ఉండాలని గుర్తించుకోండి. చాలా పెద్ద ముక్కలు ఉంటే ఉడకటం కష్టంగా అవుతుంది. పెద్దగా, చిన్నగా కాకుండా ముక్కలు మధ్యమ పరిమాణంలో కట్ చేయండి.

ఇక, నాన్‌వెజ్‌ ఉడకబెట్టే ముందు బాగా కడగాలి. అప్పుడే రక్తం, మలినాలు తొలగిపోతాయి. మాంసం త్వరగా మెత్తబడుతుంది. కడిని మాంసానికి నిమ్మరసం లేదా వెనిగర్ బాగా పట్టించాలి. కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ కలిపితే మటన్, చికెన్ త్వరగా ఉడికిపోయేలా చేస్తుంది. పెరుగు లేదా మజ్జిగలో కూడా నానబెట్టుకోవచ్చు. ఇందుకోసం ముందుగానే కావాల్సినంత ఉప్పు, కారం మసాలాలు, పెరుగు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. అరగంట తరువాత కుక్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి

వండటానికి ముందు 30 నిమిషాలు పెరుగులో ఉంచితే..మాంసం సాఫ్ట్‌గా మారుతుంది. నాన్‌వెజ్‌ వంటకాల్లో అల్లం–వెల్లుల్లి పేస్ట్ తప్పనిసరి. ఇది మాంసాన్ని మెత్తగా చేసి వండే సమయాన్ని తగ్గిస్తుంది. కావాలంటే మీరు పచ్చి బొప్పాయి పేస్ట్ మటన్‌కు పట్టించుకోవచ్చు. కొద్దిగా పచ్చి బొప్పాయి పేస్ట్ వేస్తే.. మటన్ త్వరగా ఉడుకుతుంది. ఇకపోతే, మటన్‌ వండేందుకు ప్రెషర్ కుకర్ వాడండి. ఓపెన్ పాత్ర కంటే ప్రెషర్ కుకర్‌లో త్వరగా ఉడుకుతుంది. సరైన మంట ఉపయోగించండి. మొదట మితమైన మంటలో వేయించి.. తర్వాత కుకింగ్ చేయాలి. ఉప్పు చివర్లో వేయండి. మొదటే ఉప్పు వేస్తే..మాంసం గట్టిపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి చిట్కాలు పాటిస్తూ మీకు ఇష్టమైన మటన్‌, చికెన్‌ని ఈజీగా వండుకుని, హ్యాపీగా లాగించేయండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..