AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidneys Health: మీకు ఈ అలవాట్లు ఉన్నాయా.. మీ కిడ్నీలు ఫెయిల్ అవ్వడం ఖాయం!

శరీరంలోని అన్ని భాగాలూ చాలా ముఖ్యం. ఆరోగ్యంగా, అందంగా జీవించాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకుంటే అందం, ఆరోగ్యం రెండూ మీ సొంతం అవుతాయి. అదే విధంగా శారీరక శ్రమ కూడా చాలా అవసరం. సరైన నిద్ర కూడా ముఖ్యం. మరి సరైన లైఫ్ స్టైల్ పాటిస్తే.. ఎలాంటి వ్యాధులు మీ దరి చేరకుండా ఉంటాయి. కానీ కొన్ని రకాల అలవాట్ల వల్ల మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం అనేది ఖచ్చితంగా..

Kidneys Health: మీకు ఈ అలవాట్లు ఉన్నాయా.. మీ కిడ్నీలు ఫెయిల్ అవ్వడం ఖాయం!
kidney health
Chinni Enni
|

Updated on: Jun 25, 2024 | 2:05 PM

Share

శరీరంలోని అన్ని భాగాలూ చాలా ముఖ్యం. ఆరోగ్యంగా, అందంగా జీవించాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకుంటే అందం, ఆరోగ్యం రెండూ మీ సొంతం అవుతాయి. అదే విధంగా శారీరక శ్రమ కూడా చాలా అవసరం. సరైన నిద్ర కూడా ముఖ్యం. మరి సరైన లైఫ్ స్టైల్ పాటిస్తే.. ఎలాంటి వ్యాధులు మీ దరి చేరకుండా ఉంటాయి. కానీ కొన్ని రకాల అలవాట్ల వల్ల మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం అనేది ఖచ్చితంగా పడుతుంది. దీని వలన శరీరంలోని అన్ని భాగాలూ అనారోగ్య పాలవుతారు. ముఖ్యంగా కిడ్నీలపై ఒత్తిడి అనేది ఎక్కువగా పడుతుంది. దీంతో కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.

శరీరంలోని మలినాలను, విష పదార్థాలు బయటకు పంపించడంలో మూత్ర పిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. కిడ్నీలు సరైన విధంగా పని చేస్తేనే.. శరీరంలో ఎలాంటి విష పదార్థాలు ఉండవు. అనేక వ్యాధుల నుంచి రక్షించబడుతుంది. కాబట్టి కిడ్నీలు ఆరోగ్యంగా పని చేసేందుకు కూడా సరైన ఆహారం అవసరం. అయితే కొన్ని అలవాట్ల కారణంగా మూత్ర పిండాల పని తీరు అనేది దెబ్బతింటుంది. మరి ఆ అలవాట్లు ఏంటో.. ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పు:

ఉప్పు అనేది శరీరానికి ముఖ్యం. అయితే మరీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం అనర్థాలకు దారి తీస్తుంది. ఉప్పులో సోడియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో సోడియం కంటెంట్ ఎక్కువ అవుతుంది. దీని వల్ల కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

ఆల్కహాల్:

మద్యం సేవించడం వల్ల లివర్ మాత్రమే కాదు.. కిడ్నీలు కూడా పాడవుతాయి. మద్యాన్ని బయటకు పంపించడంలో కిడ్నీలకు చాలా సమయం పడుతుంది. శరీరంలో వ్యర్థాలు పేరుకు పోయి ప్రాణానికే ప్రమాదం రావచ్చు.

నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి:

చాలా మంది నీళ్లను చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు. కిడ్నీలు ఆరోగ్యంగా పని చేయాలంటే నీళ్లు చాలా అవసరం. నీళ్లను సరిగ్గా తాగకపోతే.. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపలేవు.

జంక్ ఫుడ్స్:

జంక్ ఫుడ్స్, ఇన్‌స్టెంట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. వీటిల్లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నాలకు చేటు చేస్తుంది. కాబట్టి వీటికి చాలా దూరంగా ఉండాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే