పొగలు కక్కే వేడి టీ, కాఫీలు తాగుతున్నారా? అది ఎంత డేంజరో తెలిస్తే అసలు ముట్టరు!
భారతదేశంలో ఎక్కువమంది తమ రోజును ఒక కప్పు టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. రోజంతా ఉండే అలసటను నివారించడానికి, మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి టీ-కాఫీలు అద్భుతమైన పానీయాలుగా పనిచేస్తాయి. అయితే చాలామందికి టీ లేదా కాఫీ పొగలు కక్కుతూ, పెదవులు కాలేంత వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తాగే అలవాటు ఉంటుంది. ఈ చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకమైన ఒక రకం క్యాన్సర్‌కు కారణమవుతుందని వైద్యులు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

భారతదేశంలో ఎక్కువమంది తమ రోజును ఒక కప్పు టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. రోజంతా ఉండే అలసటను నివారించడానికి, మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి టీ-కాఫీలు అద్భుతమైన పానీయాలుగా పనిచేస్తాయి. అయితే చాలామందికి టీ లేదా కాఫీ పొగలు కక్కుతూ, పెదవులు కాలేంత వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తాగే అలవాటు ఉంటుంది. ఈ చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకమైన ఒక రకం క్యాన్సర్‌కు కారణమవుతుందని వైద్యులు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు.
చాలామందికి ఉదయాన్నే లేదా అలసటగా అనిపించినప్పుడు పొగలు కక్కే అతి వేడి టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు, ముఖ్యంగా ఆహారవాహిక క్యాన్సర్ ముప్పుకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, క్యాన్సర్ పరిశోధనా సంస్థల ప్రకారం.. 65 డిగ్రీల సెల్సియస్ (149°F) లేదా అంతకంటే ఎక్కువ వేడి ఉన్న పానీయాలను రోజువారీగా తాగడం క్యాన్సర్ కారకం గా మారే అవకాశం ఉంది. కాఫీ లేదా టీ అనేది స్వతహాగా క్యాన్సర్ కలిగించదు. కానీ, వాటిని అతి వేడిగా తాగడం వల్ల కలిగే ఉష్ణోగ్రత శరీర భాగాన్ని దెబ్బతీస్తుంది.
మన నోరు, గొంతు నుండి కడుపు వరకు ఆహారాన్ని తీసుకెళ్లే నాళాన్ని ఆహారవాహిక అంటారు. దీని లోపలి పొరలు చాలా సున్నితంగా ఉంటాయి. క్రమం తప్పకుండా అత్యంత వేడి కలిగిన పానీయాలు తాగినప్పుడు..ఆహారవాహిక కణజాలాలు పదే పదే కాలిన గాయాలకు గురవుతాయి. ఈ కణాలు పదే పదే దెబ్బతినడం, తిరిగి కోలుకునే క్రమంలో అసాధారణమైన కణాల ఉత్పత్తికి దారితీస్తుంది. ఈ కణాల మార్పులు కాలక్రమేణా కణితిగా మారే అవకాశం పెరిగి, చివరకు ఆహారవాహిక క్యాన్సర్‌గా రూపాంతరం చెందుతాయి. అతి వేడి తాగడం వల్ల ఆహారవాహిక దెబ్బతిన్నప్పుడు ఆహారం మింగడంలో ఇబ్బంది, గొంతులో పుండు పడటం, చాతిలో మంట, స్వరం మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వైద్యుల సూచన:
టీ లేదా కాఫీని కప్పులో పోసిన వెంటనే కాకుండా, ఒక 3 నుండి 5 నిమిషాల పాటు పక్కన పెట్టి, ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చిన తర్వాత తాగడం అలవాటు చేసుకోవాలి. మనం తీసుకునే చిన్న జాగ్రత్తలే మనల్ని పెద్ద వ్యాధుల నుండి కాపాడుతాయని గుర్తుంచుకోవాలి.




