
ఆరోగ్యకరమైన జీవనశైలికి మీరు తీసుకునే ఆహారం,మీ దినచర్యలో చిన్న చిన్న మార్పులు చాలా అవసరం. అలాంటి ఒక పద్ధతి ఉదయం ఖాళీ కడుపుతో బార్లీ వాటర్ తాగడం. బార్లీ అనేది పోషకమైన ధాన్యం. దీనిని పురాతన కాలం నుండి దాని ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. బార్లీ నీరు శరీరాన్ని డీటాక్సిఫై చేయడమే కాకుండా అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. 30 రోజుల పాటు ఉదయం ఖాళీ కడుపుతో బార్లీ నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు.
సాధారణంగా కొలెస్ట్రాల్ సమస్యల కారణంగా చాలామంది ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొలెస్ట్రాల్ విపరీతంగా పెరగడం కారణంగా ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. ఈ సమస్యలు రాకుండా ఉండడానికి బార్లీ వాటర్ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. రోజు ఉదయాన్నే బార్లీ వాటర్ తాగితే అందులో లభించే బీటా-గ్లూకాన్ ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించేందుకు సహాయపడుతుంది. బార్లీ నీరు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, గట్ బ్యాక్టీరియా సమతుల్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇంకా, బార్లీ నీరు మూత్రపిండాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. నిర్విషీకరణ ఏజెంట్‌గా పనిచేస్తుంది.
ముఖ్యంగా రోజు ఉదయం 30 రోజులపాటు బార్లీ వాటర్ తాగితే.. కొలెస్ట్రాల్ పరిమాణాలు ఎంతో సులభంగా తగ్గిపోతాయి. ఇలా బార్లీ వాటర్ రోజు తాగితే గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం వ్యాధిగ్రస్తులు రోజు ఉదయం లేచిన వెంటనే బార్లీ వాటర్ తప్పకుండా తాగాల్సి ఉంటుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..