Pimple: మొటిమలు, మచ్చల నివారణకు సూపర్‌ డ్రింక్స్‌.. పట్టులాంటి మెరిసే చర్మం మీ సొంతం..

అలాంటి వారు కొన్ని సందర్భాల్లో తమలోని ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోతుంటారు. అలాంటి వారికి ఉపశమనం కలిగేంచేవే ఇప్పుడు మనం తెలుసుకోబోయే మొటిమల నివారణ డ్రింక్స్..

Pimple: మొటిమలు, మచ్చల నివారణకు సూపర్‌ డ్రింక్స్‌.. పట్టులాంటి మెరిసే చర్మం మీ సొంతం..
Quick Glowing Skin
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 14, 2023 | 5:33 PM

కౌమారదశలో ముఖంపై మొటిమలు కనిపిస్తాయి. కానీ చాలా సార్లు మొటిమలు 25 నుండి 30 సంవత్సరాల వయస్సు తర్వాత కూడా తగ్గవు. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఏం చేయాలి..? అసలు ఈ మొటిమలకు కారణం మన ఆహారం, చర్మం రకం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మొటిమల వల్ల మన ముఖ సౌందర్యం పాడైపోతుంది. దాంతో నలుగురిలోకి వెళ్లలంటే ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారు కొన్ని సందర్భాల్లో తమలోని ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోతుంటారు. అలాంటి వారికి ఉపశమనం కలిగేంచేవే ఇప్పుడు మనం తెలుసుకోబోయే మొటిమల నివారణ డ్రింక్స్..

1. ఉసిరికాయ – అల్లం ఉసిరికాయలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలు కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతాయి. మరోవైపు, మీరు అల్లం ఉపయోగిస్తే, ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉసిరికాయ, అల్లం రసాన్ని మిక్స్ చేసి తాగడం వల్ల ముఖానికి మంచి గ్లో వస్తుంది. మచ్చలు తొలగిపోతాయి.

2. వేప – తేనె వేప రుచిలో చేదుగా ఉన్నప్పటికీ, దాని ప్రయోజనాల మాత్రం అద్భుతమనే చెప్పాలి..వేప ఆకుల్లో ఉండే ఔషధగుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల ముఖంపై ఉండే మొటిమలు మాయమవుతాయి. దీని కోసం, వేప ఆకులను ఒక పాత్రలో నీళ్లు పోసి అందులో వేపాకులు వేసి ఉంచాలి..ఆకులు రంగు మారేంతవరకు ఆగాలి..రంగు మారిన నీటిని త్రాగాలి. ఈ పానీయం చేదు తగ్గాలంటే అందులో తేనె కలపండి.

ఇవి కూడా చదవండి

3. గ్రీన్ టీ- నిమ్మకాయ గ్రీన్ టీ, నిమ్మకాయ శరీర బరువును తగ్గిస్తుంది. అయితే ఈ రెండు పదార్థాలతో డ్రింక్ తయారు చేస్తే ముఖంపై ఉండే మొటిమలు కూడా పోతాయి. ఇందుకోసం గ్రీన్ టీలో నిమ్మరసం పిండుకుని తాగాలి. లెమన్, గ్రీన్ టీలో ఉండే విటమిన్ సి చర్మానికి చాలా మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..